Google Pay: అప్పట్లో దాదాపు అన్నిటెల్కోలు ఇన్ కమింగ్ సేవలను ఫ్రీగా అందించేవి. కాగా గతంలో ఇచ్చిన ఉచితాలకు ఆయా కంపెనీలు ఇటీవల మంగళం పాడాయి. ఇప్పుడు ఇదే పద్ధతిని టెక్ దిగ్గజం గూగుల్ సైతం అనుసరించనుంది. మొబైల్ రీఛార్జ్‌లపై రుసుము విధించడం ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జ్ చేసే వినియోగదారుల నుంచి రూ.3 వరకు సౌకర్య రుసుమును వసూలు చేయాలని గూగుల్ పే భావిస్తోంది. పేటీఎం, ఫోన్ పే వంటి ఇతర పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పటికే ఈ ఛార్జీలు విధిస్తుండగా.. ఇప్పుడు గూగుల్ పే సైతం ఆ లిస్టులో చేరనుంది.

ప్రస్తుతం ఈ రుసుమును కేవలం మొబైల్ రీఛార్జ్‌లకు మాత్రమే పరిమితం చేయనున్నట్లు కనిపిస్తోంది. విద్యుత్ బిల్లులు, ఫాస్ట్‌ట్యాగ్ వంటి ఇతర లావాదేవీలకు దీన్ని వర్తింపచేయడం లేదు. అయితే 200 వరకు రీఛార్జ్ ప్లాన్‌లపై కన్వీనియన్స్ ఫీజు వసూలు చేసే అవకాశం లేదని మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
రుసుములకు సంబంధించి గూగుల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నవంబర్ 10న గూగుల్ పే సేవా తన నిబంధనలను అప్‌డేట్ చేసింది. ఇందులో 'గూగుల్ ఫీజ్' అనే కొత్త పదాన్ని ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి రీఛార్జ్‌లపై సౌలభ్య రుసుము విధించబడకపోగా.. దశలవారీగా ఈ మార్పులు అమలు చేయాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications