ఇంటి నుంచి పని చేసే విధానంలో Google పెద్ద మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉద్యోగులు "ఎక్కడ నుంచైనా ఉంది పని చేయడం" (WFA) పాలసీని వాడి, సంవత్సరానికి నాలుగు వారాలు తమ ఆఫీస్ కాకుండా ఇతర ప్రదేశాల నుంచి పని చేయగలిగేవారు. కానీ ఇప్పుడు కంపెనీ ఆ సౌకర్యాన్ని కఠినతరం చేస్తోంది.
Work From Anywhere అంటే ఏమిటి?
కోవిడ్ కాలంలో గూగుల్ ఉద్యోగులకు ఎక్కడి నుంచైనా పని చేయడానికి ఈ WFA పాలసీని ప్రారంభించింది. ఉదాహరణకు ఎవరైనా తమ స్వగ్రామం లేదా మరో దేశానికి వెళ్లి అక్కడినుంచి కొద్ది రోజులు పని చేయవచ్చు. కానీ ఇప్పుడు గూగుల్ ఏం చెబ్తుండంటే మీరు ఒక వారంలో కేవలం "ఒక రోజు" మాత్రమే బయట ప్రదేశం నుంచీ పనిచేసినా, అది మొత్తం ఒక వారంగా లెక్కిస్తారు. అంటే WFA బ్యాలెన్స్ నుండి ఒక పూర్తి వారం తగ్గుతుంది.

అదే సమయంలో, కంపెనీ తన హైబ్రిడ్ వర్క్ మోడల్ ను కొనసాగిస్తోంది. ఉద్యోగులు వారానికి రెండు రోజులు ఇంటి నుంచి (WFH) పని చేయవచ్చు. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే WFA రోజులు మరియు WFH రోజులు పూర్తిగా వేర్వేరు. "WFH" అంటే మీ ఇంటినుంచే పని చేయడం. "WFA" అంటే ఇంటి నుంచీ కాకుండా వేరే రాష్ట్రం లేదా దేశంలోని ప్రదేశం నుండి పని చేయడం.
గూగుల్ స్పష్టంగా చెప్పింది WFA వారాలను ఇంటినుంచి పని చేయడానికి వాడకూడదు. ఉదాహరణకు, హైదరాబాద్‌లో ఉన్న ఉద్యోగి "WFA" తీసుకుని అదే హైదరాబాద్‌లోని ఇంటి నుంచే పని చేయడం కుదరదు. ఈ పాలసీని ఉల్లంఘిస్తే "డిసిప్లినరీ యాక్షన్ లేదా ఉద్యోగ విరమణ" వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
అలాగే, వేరే ప్రదేశం నుండి పనిచేస్తున్నప్పుడు స్థానిక టైమ్‌జోన్ ప్రకారం బిజినెస్ అవర్స్‌లో పని చేయడం తప్పనిసరి. దీనికి "సరిహద్దు పని" వల్ల వచ్చే చట్ట పరమైన, ఆర్థిక సమస్యలే కారణమని గూగుల్ చెబుతోంది.
కొత్త పాలసీ అందరికీ వర్తించదు. డేటా సెంటర్‌లలో లేదా భౌతికంగా హాజరు కావాల్సిన ఉద్యోగులకు ఈ నియమాలు వర్తించవు. కానీ, మిగతా రిమోట్ లేదా హైబ్రిడ్‌గా పనిచేసే ఉద్యోగులందరికీ మాత్రం ఇవి తప్పనిసరి. ఈ మార్పులు గూగుల్ ఉద్యోగుల్లో కొంత అయోమయం కలిగించాయి. ఇటీవల జరిగిన ఆల్-హ్యాండ్స్ మీటింగ్‌లో చాలా మంది ఈ విషయంపై ప్రశ్నలు అడిగారు. అందులో ఒక ప్రధాన ప్రశ్న "ఒక రోజు మాత్రమే WFA తీసుకున్నా దాన్ని ఎందుకు ఒక వారం గా లెక్కిస్తున్నారు? అలాగే ఇంటినుంచి పని చేయడానికి WFA వాడకూడదనే నియమాన్ని మళ్లీ పరిగణించలేరా?" అని ఉంది.
గూగుల్ VP జాన్ కేసీ చెప్పినట్లుగా, WFA పాలసీ పాండమిక్ సమయంలో ఉద్యోగులకు సౌకర్యం కల్పించడానికి మాత్రమే రూపొందించబడింది. దీన్ని ఎల్లప్పుడూ వారాల వారీగా ఉపయోగించేలా ఉద్దేశించబడింది, ఒక్కో రోజు ఇంటినుంచి పని చేసే హైబ్రిడ్ షెడ్యూల్‌కు ప్రత్యామ్నాయం కాదు. మొత్తానికి, గూగుల్ ఇప్పుడు WFA మరియు WFH మధ్య స్పష్టమైన గీతలు గీసింది. ఎక్కడి నుంచైనా పని చేసే సౌకర్యాన్ని క్రమబద్ధం చేస్తూ, ఉద్యోగులు ఈ రెండు ఆప్షన్లను కలిపి వాడకుండా స్పష్టంగా చెప్పింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications