గూగుల్ జాబ్ వదలడం ఈజీ, కానీ బెంగళూరును వదలడం కాదు! వైరల్ అవుతున్న టెక్కీ పోస్ట్!

"ఐ లవ్ యూ, ఐయామ్ సారీ".. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? ఒకప్పుడు గూగుల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన హర్షిత్ శర్మ. కొన్ని నెలల క్రితం తన లైఫ్‌ను తనదైన పద్ధతిలో ఎంజాయ్ చేయాలని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం గూగుల్‌లో చేస్తున్న లగ్జరీ జాబ్‌ను వదిలేశాడు. అప్పట్లో ఆ విషయం పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే, ఇప్పుడు హర్షిత్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఈసారి తన కెరీర్ గురించో, డబ్బు గురించో కాదు.. తను ప్రాణంగా ప్రేమించిన బెంగళూరు (Bengaluru) నగరాన్ని వదిలి వెళ్తూ పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

Google Techie Harshit Sharma Bengaluru Farewell Post Viral Moving Back Home

గూగుల్ జాబ్ కంటే బెంగళూరును వదలడమే కష్టం!

తన రెండేళ్ల బెంగళూరు లైఫ్‌కు గుడ్ బై చెప్పేసి, హర్షిత్ రీసెంట్‌గా తన సొంత ఇంటికి తిరుగుప్రయాణం అయ్యాడు. ఈ క్రమంలో కార్‌లో వెళ్తూ తన ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేశాడట. ఇంకేముంది.. పాత ఫోటోలు చూసేసరికి పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చి కళ్లు చెమర్చాయట. "గూగుల్ లాంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం వదిలేయడం కంటే, ఈ గార్డెన్ సిటీని వదిలి వెళ్లడం నాకు చాలా కష్టంగా అనిపించింది" అంటూ హర్షిత్ రాసుకొచ్చాడు.

రమేశ్వరం కేఫ్, వీకెండ్ పార్టీలు.. అన్నీ గుర్తోచ్చాయ్!

ఈ రెండు సంవత్సరాలలో బెంగళూరులో తను మిస్ అవ్వబోయే ప్రతి విషయాన్ని హర్షిత్ గుర్తుచేసుకున్నాడు. ఫ్రెండ్స్‌తో కలిసి సడన్‌గా రమేశ్వరం కేఫ్‌కి వెళ్లడం, ఆఫీస్ పని పక్కన పెట్టి కొలీగ్స్‌తో అర్ధరాత్రి వరకు హ్యాపీగా మాట్లాడుకోవడం, వీకెండ్ వస్తే చాలు బిఎల్ఆర్ బ్రూవరీ లేదా ఐరన్‌హిల్ వంటి ఫేమస్ స్పాట్స్‌లో పార్టీలు చేసుకోవడం.. ఇలాంటి ఎన్నో మూమెంట్స్‌ను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు. "ఈ రెండేళ్లలో నా లైఫ్‌లో ఎంతో జరిగింది. కానీ ఇదంతా ఇంత త్వరగా ముగిసిపోతుందని అస్సలు అనుకోలేదు" అని హర్షిత్ ఆవేదన వ్యక్తం చేశాడు.

బెంగళూరు నిజంగానే గ్రేట్ సిటీనా?

హర్షిత్ పోస్ట్‌పై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. "నిజంగానే బెంగళూరు ఒక అద్భుతమైన నగరం" అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. దానికి హర్షిత్ రిప్లై ఇస్తూ, "నేను పక్కా ఢిల్లీ వాడిని కాకపోయి ఉంటే.. బెంగళూరే ప్రపంచంలోనే బెస్ట్ సిటీ అని చెప్పేవాడిని. ఎందుకంటే ఇక్కడ సేఫ్టీ ఎక్కువ, పొల్యూషన్ తక్కువ, అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడి జనాలు చాలా మంచివాళ్లు" అంటూ సిటీపై తనకున్న ప్రేమనంతా కురిపించాడు.

జీవితంలో ఒక భాగం ముగిసింది!

నిజానికి ఇది కేవలం హర్షిత్ కథ మాత్రమే కాదు. బెంగళూరు(Bengaluru) లేదా ఏదైనా కొత్త నగరానికి చదువు కోసమో, ఉద్యోగం కోసమో వచ్చి, అక్కడ కొన్నేళ్లు ఉండి, ఆ తర్వాత ఆ సిటీని వదిలి వెళ్లే ప్రతి ఒక్కరి కథ ఇది. మనం ఒక ఊరిని వదిలి వెళ్తున్నామంటే.. కేవలం ఆ ప్లేస్‌ను మాత్రమే కాదు, అక్కడ మనం బతికిన జీవితాన్ని, మనకున్న స్నేహితులను, ఆ జ్ఞాపకాలను కూడా వదిలేసి వెళ్తున్నట్లే. మళ్లీ ఎప్పుడైనా ఆ నగరానికి తిరిగి రావచ్చు, కానీ పాత రోజులు, పాత మనుషులు మళ్లీ రారు కదా! అందుకే హర్షిత్ షేర్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+