గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యూహంలో భాగంగా మరో కీలకమైన అడుగు ముందుకు వేసింది. జెమిని 3 ప్రో మోడల్ లాంచ్ అయిన కొద్ది గంటల వ్యవధిలోనే.. డిసెంబర్ 17న గూగుల్ జెమిని 3 ఫ్లాష్ అనే కొత్త AI మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ మోడల్‌ను గూగుల్ తన జెమిని యాప్‌లో డిఫాల్ట్ AI మోడల్‌గా కూడా మార్చడం విశేషం. దీని ద్వారా వేగం, తక్కువ ఖర్చు, అధిక పనితీరు అనే మూడు అంశాలను ఒకే మోడల్‌లో సమతుల్యం చేయగలిగామని గూగుల్ తెలిపింది.
జెమిని 3 ఫ్లాష్ ముఖ్యంగా ఉచిత వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. ఉచిత యూజర్లకు గూగుల్ తన థింకింగ్ (Reasoning) మోడల్‌పై పరిమిత ప్రశ్నలు అడిగే అవకాశాన్ని ఇస్తోంది. ఆ పరిమితి పూర్తయిన తర్వాత, మిగిలిన ప్రశ్నలు ఆటోమేటిక్‌గా నాన్-రీజనింగ్ మోడల్‌కు మారుతాయి. ఈ మోడ్‌ను జెమిని యాప్‌లో ఫాస్ట్ అని సూచిస్తున్నారు. దీని వల్ల రోజువారీ పనులకు వేగంగా సమాధానాలు లభిస్తాయి.

గూగుల్ బ్లాగ్ పోస్టులో మాట్లాడుతూ.. జెమిని 3 ఫ్లాష్ వేగం, స్కేల్ కోసం తెలివితేటలను త్యాగం చేయాల్సిన అవసరం లేదని నిరూపిస్తుందని పేర్కొంది. ఈ మోడల్ GPQA డైమండ్ (90.4%), హ్యుమానిటీస్ లాస్ట్ ఎగ్జామ్ (33.7%) వంటి పీహెచ్‌డీ స్థాయి బెంచ్‌మార్క్‌లలో అద్భుతమైన పనితీరును చూపించిందని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా, అనేక ప్రమాణాల్లో ఇప్పటివరకు గూగుల్‌లో అత్యుత్తమంగా భావించిన జెమిని 2.5 ప్రో మోడల్‌ను కూడా గణనీయంగా అధిగమించింది.
ఆర్టిఫిషియల్ అనాలిసిస్ బెంచ్‌మార్క్‌లో చూస్తే..Gemini 3 Flash, జెమిని 2.5 ప్రో కంటే మూడు రెట్లు వేగంగా పని చేస్తుందని, అదే సమయంలో తక్కువ ఖర్చుతో నడుస్తుందని గూగుల్ తెలిపింది. గత నెల వరకు బెంచ్‌మార్క్‌లలో అగ్రస్థానంలో ఉన్న జెమిని 2.5 ప్రోను ఇప్పుడు ఫ్లాష్ మోడల్ వెనక్కి నెట్టేసింది. హ్యుమానిటీస్ లాస్ట్ ఎగ్జామ్ బెంచ్‌మార్క్‌లో జెమిని 3 ఫ్లాష్ 33% స్కోర్ సాధించింది. ఇది గ్రోక్ 4.1 ఫాస్ట్ (17.6%), క్లాడ్ సోనెట్ 4.5 (13.7%) కంటే చాలా ముందుండగా, GPT-5.2 (34.5%) కంటే కేవలం స్వల్ప తేడాతో వెనుకబడింది. కోడింగ్‌కు సంబంధించిన SWE-బెంచ్ వెరిఫైడ్ లో జెమిని 3 ఫ్లాష్ 78% స్కోర్ సాధించి, క్లాడ్ 4.5 సోనెట్‌ను దాటగా, GPT-5.2కి చాలా దగ్గరగా నిలిచింది.
విజువల్ రీజనింగ్‌కు సంబంధించిన ARC-AGI-2 బెంచ్‌మార్క్‌లో అయితే జెమిని 3 ఫ్లాష్ మరింత ఆశ్చర్యం కలిగించింది. ఈ పరీక్షలో ఇది క్లాడ్, జెమిని 2.5 ప్రో మాత్రమే కాకుండా, తాజాగా విడుదలైన జెమిని 3 ప్రో మోడల్‌ను కూడా అధిగమించింది.గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం.. జెమిని 3 ఫ్లాష్ ఎంతగా ఆలోచించాలో పరిస్థితిని బట్టి నియంత్రించగలదు. క్లిష్టమైన సమస్యలకు ఎక్కువసేపు ఆలోచిస్తే, సాధారణ రోజువారీ పనుల్లో మాత్రం జెమిని 2.5 ప్రో కంటే సగటున 30% తక్కువ టోకెన్‌లతోనే ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది.
ప్రస్తుతం జెమిని 3 ఫ్లాష్ జెమిని యాప్‌లో డిఫాల్ట్‌గా అందుబాటులో ఉంది. దీనికి అదనపు చార్జీలు అవసరం లేదు. ఇదే మోడల్ గూగుల్ సెర్చ్‌లోని AI మోడ్‌కు కూడా శక్తినిస్తుంది. తద్వారా వినియోగదారులు సంభాషణ శైలిలో ప్రశ్నలు అడగవచ్చు. మల్టీమోడల్ సామర్థ్యాలతో, వీడియోలు, చిత్రాలు, ఆడియోలను అర్థం చేసుకుని వాటిని సెకన్లలోనే కార్యాచరణ ప్రణాళికగా మార్చగల శక్తిని జెమిని 3 ఫ్లాష్ కలిగి ఉందని గూగుల్ స్పష్టం చేసింది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications