చాలా మంది తమ చిన్నతనంలోనో లేదా అవగాహన లేకనో వింత వింత పేర్లతో జీమెయిల్ అడ్రస్‌లను క్రియేట్ చేసుకుంటారు. ఆ తర్వాత ప్రొఫెషనల్ అవసరాల కోసం ఆ అడ్రస్‌ను చెప్పాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పటివరకు వేరే దారి లేక కొత్త అకౌంట్ క్రియేట్ చేసి డేటా మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవసరం లేదు! గూగుల్ త్వరలో జీమెయిల్ అడ్రెస్ చేంజ్ (gmail address change) చేసుకునే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం గూగుల్ హిందీ సపోర్ట్ పేజీలో కనిపించిన వివరాల ప్రకారం.. ఈ ఫీచర్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రానుంది. ఇదెలా పని చేస్తుంది? ఎప్పటి నుంచి అందుబాటలోకి వస్తుంది? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
మీరు మీ పాత '@gmail.com' అడ్రస్ ను మార్చుకున్నప్పుడు.. మీ పాత డేటా అంటే ఈమెయిల్స్, ఫోటోలు, డ్రైవ్ ఫైల్స్ వంటివి ఏవీ డిలీట్ అవ్వవు.
- అలియాస్ (Alias) గా పాత ఐడీ: మీరు కొత్త అడ్రస్ తీసుకున్న తర్వాత.. మీ పాత అడ్రస్ ఒక 'అలియాస్' లా పనిచేస్తుంది. అంటే ఎవరైనా మీ పాత ఐడీకి మెయిల్ పంపినా అవి మీ కొత్త ఐడీ ఇన్‌బాక్స్‌కే వస్తాయి.
- లాగిన్ సౌకర్యం: మీరు పాత ఐడీతో లేదా కొత్త ఐడీతో.. దేనితోనైనా మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వవచ్చు.
ముఖ్యమైన రూల్స్ ఇవే..
ఈ జీమెయిల్ అడ్రెస్ చేంజ్ (gmail address change) ఫీచర్ పై గూగుల్ కొన్ని కఠినమైన రూల్స్ పెట్టింది. దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు..
- ఏడాదికి ఒకసారి మాత్రమే: మీరు మీ జీమెయిల్ అడ్రస్‌ను 12 నెలల్లో ఒక్కసారి మాత్రమే మార్చుకోగలరు.
- లైఫ్ టైమ్ లిమిట్: ఒక అకౌంట్‌కు గరిష్టంగా 4 అడ్రస్‌లు (1 ఒరిజినల్ + 3 మార్పులు) మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది.
- పాత ఐడీ భద్రత: మీరు వదిలేసిన పాత అడ్రస్‌ను ఇతరులు ఎవరూ తీసుకోలేరు. అది మీ అకౌంట్‌కే శాశ్వతంగా లింక్ అయి ఉంటుంది.
- వెయిటింగ్ పీరియడ్: కొత్త అడ్రస్ సెట్ చేసుకున్న తర్వాత 12 నెలల వరకు దాన్ని డిలీట్ చేయడం లేదా మళ్ళీ మార్చడం కుదరదు.
ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
ప్రస్తుతం ఈ ఫీచర్ 'గ్రాడ్యువల్ రోలౌట్' అంటే దశలవారీగా అమలు అవుతోంది. అంటే అందరికీ ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా అందుబాటులోకి వస్తుంది. 2026 ప్రారంభం నాటికి ఇది పూర్తిస్థాయిలో అందరి జీమెయిల్ సెట్టింగ్స్‌లో కనిపించే అవకాశం ఉంది.
Gmail అడ్రస్ ఎలా మార్చాలి?
ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ క్రింది విధంగా చేయవచ్చు
- మీ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి (myaccount.google.com) వెళ్ళండి.
- అక్కడ 'Personal Info' ట్యాబ్ పై క్లిక్ చేయండి.
- 'Contact Info' విభాగంలో 'Email' పైన క్లిక్ చేయండి.
- అక్కడ 'Google Account Email' ఆప్షన్ దగ్గర ఎడిట్ లేదా చేంజ్ బటన్ కనిపిస్తుంది (ఫీచర్ మీకు రోలౌట్ అయితేనే ఇది కనిపిస్తుంది).
- మీ కొత్త యూజర్‌నేమ్ ఇచ్చి వెరిఫై చేసుకుంటే సరిపోతుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications