google layoffs: ఆఫీస్ కాల్ కట్ అయిందా ? మీ జాబ్ ఉందో, ఊడిందో చెక్ చేసుకోండి..!!
google layoffs: మాంద్యం భయాలతో టెక్ కంపెనీలు వరుస లే ఆఫ్ లతో గుబులు పుట్టిస్తున్నాయి. బాధితులుగా మిగిలిన ఉద్యోగులు ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ లో తమ బాధలు పంచుకుంటున్నారు. తమ నైపుణ్యానికి తగిన ఉద్యోగమేదైనా ఉంటే స్పందించమని కోరుతున్నారు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థ సైతం లే ఆఫ్ ప్రకటించడాన్ని ఎవరూ ఊహించలేదు. అనూహ్య రీతిలో సంస్థ ఎలా తనను తొలగించిందో తెలుపుతూ.. లింక్డ్‌ఇన్ లో ర్యాన్ అనే రిక్రూటర్ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు.
కాల్ లో ఉండగానే...
"ఉద్యోగం కోసం ఓ అభ్యర్థిని ఫోన్ లో ఇంటర్వ్యూ చేస్తుండగా అకస్మాత్తుగా కాల్ కట్ అయింది. తిరిగి కాల్ చేయడానికి ప్రయత్నించినా కాల్ వెళ్లలేదు. కంపెనీ అంతర్గత సైట్ లోకి లాగిన్ అవడానికి ప్రయత్నించినా కుదరలేదు. మా టీంలోని మరి కొందరు అకౌంట్ నుంచి సడెన్ గా లాగవుట్ అయ్యాయి. మా మేనేజర్ కి సమాచారమిస్తే.. అదేదో సాంకేతిక సమస్య అయి ఉండవచ్చు అని తోసిపుచ్చారు. దాదాపు 12 వేల మందిని తొలగిస్తున్నామని.. అందులో నేనూ ఓ భాగమని మెయిల్ ద్వారా తెలియచేసే వరకు ఈ తరహా వ్యవహారమొకటి జరుగుతుందని సైతం తెలియదు" అని ర్యాన్ రాసుకొచ్చాడు.

మొగట సైట్, తర్వాత మెయిల్
మొదట కంపెనీ వెబ్ సైట్ కు యాక్సెస్ కోల్పోయాననీ, అనంతరం మెయిల్ సైతం బ్లాక్ చేశారని ర్యాన్ తన పోస్టులో రాశాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత.. గూగుల్ 12 వేల మందికి ఉద్వాసన పలికినట్లు వార్త విన్నట్లు పేర్కొన్నాడు. గూగుల్ తన డ్రీమ్ కంపెనీ అని తెలిపాడు. ఏడాదికి సంస్థలో పనిచేస్తుండగా.. అంత త్వరగా ఉద్యోగం కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశాడు.

వేతనాల పెంపుపై చర్చ.. ఇంతలోనే...
తన ఉద్యోగానికి సంబంధించిన కాంట్రాక్ట్ మరో ఏడాది పొడిగించినట్లు ర్యాన్ చెప్పాడు. సమీప భవిష్యత్తులో మరింత ఎదుగుదలకు అవకాశమున్న క్లౌడ్ సేల్స్ రిక్రూట్ మెంట్ టీంకి తరలించారు. వారం క్రితమే వేతనాల పెంపు గురించి సైతం నాతో చర్చించారు అని ఆవేదన వ్యక్తం చేశాడు. కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ లేఆఫ్‌లకు పూర్తి బాధ్యత వహించారు. బాధితులకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications