Slice App: ఫిన్ టెక్ కంపెనీ స్లైస్ యాప్ యూజర్లకు పెద్ద చిక్కొచ్చిపడింది. అదేంటంటే యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాను ఈ యాప్ తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని గూగుల్ ప్లేస్టోర్ హెచ్చరించింది. క్రెడిట్ కార్డుకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి వచ్చిన ఈ యాప్ హానికరమైన యాప్ గా గుర్తింపబడింది. ఇది వ్యక్తిగత డేటాపై గూఢచర్యం చేస్తోందని వెలుగులోకి వచ్చింది. దీంతో "స్లైస్ మీ పరికరాన్ని ప్రమాదంలో పడేస్తుంది" అంటూ గూగుల్ ప్లే స్టోర్ వినియోగదారులకు హెచ్చరిక నోటిఫికేషన్ పంపింది.

స్లైస్ వ్యక్తిగత డేటాపై గూఢచర్యానికి యత్నం..
నోటిఫికేషన్‌పై క్లిక్ చేయడం ద్వారా వినియోగదారుని ప్లే ప్రొటెక్ట్ పేజీకి ఆటోమెటిక్ గా తీసుకువెళతారు. ఇది స్లైస్ మెసేజ్ లు, ఫోటోలు, ఆడియో రికార్డింగ్స్, కాల్ హిస్టరీ వంటి వ్యక్తిగత డేటాపై గూఢచర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్న హానికరమైన యాప్ అని ప్లే స్టోర్ హెచ్చరించింది. ఇది యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయమని వినియోగదారులను సూచిస్తోంది.
సమస్యను పరిష్కరించామంటున్న స్లైస్..
ఈ వ్యవహారంలో సమస్యను పరిష్కరించినట్లు స్లైస్ తన ట్విట్టర్‌లో వివరణ కూడా ఇచ్చింది. నిన్న సాయంత్రం తమ ఆండ్రాయిడ్ అప్‌డేట్ ప్లే స్టోర్ నుంచి రిస్క్ సందేశానికి దారితీసిందని వెల్లడించింది. తమ ఇంజనీర్లు ఈ సమస్యను గుర్తించి 4 గంటల్లోపే పరిష్కరించినట్లు తెలిపింది. కొంత మంది యాప్ వినియోగదారులు ఇప్పటికీ మునుపటి వెర్షన్‌లోనే ఉన్నారు. ఈ సమస్య ఎదురైతే వీలైనంత త్వరగా కొత్త వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలని కంపెనీ సూచించింది.

రిజర్వు బ్యాంక్ నిషేధ సమయంలోనే..
ఫిన్ టెక్ కంపెనీలు వినియోగదారులకు క్రెడిట్ అందించరాదని రిజర్వు బ్యాంక్ తాజాగా వెళ్లడించిన తరుణంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. వాలెట్లు, ప్రీపెయిడ్ కార్డ్‌లు వంటి నాన్-బ్యాంకింగ్ ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు తమ ప్లాట్‌ఫారమ్‌లపై క్రెడిట్ లైన్లను లోడ్ చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల నిషేధించిన విషయం తెలిసిందే. నాన్-బ్యాంకింగ్ సంస్థలు తమపై క్రెడిట్ లైన్లను లోడ్ చేయలేవని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. దీని వల్ల ప్రభావితమయ్యే కంపెనీల్లో స్లైస్, యూనికార్డ్‌లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications