Bharat GPT: దేశీయ భాషల్లో సొంత ఏఐ భారత్ జి. పి.టి..బెంగళూరు కంపెనీలో గూగుల్ పెట్టుబడి..!
ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది అదే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. అమెరికాకు చెందిన చాట్ జీపీటీ అనే సంస్థ ఇప్పటికే తన ఏఐ సేవలను ఆంగ్లంలో అందిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే వివిధ ప్రాంతీయ భాషల్లోని ప్రజలు ఏఐ సేవలను వినియోగించుకునేందుకు వీలుగా ఇప్పటికే ప్రయత్నాలు ఇండియాలో కొనసాగుతున్నాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఏఐ స్టార్టప్ కపెనీ CoRover.ai భారత్ జీపీటీ పేరుతో దేశీయ భాషల్లో నమూనాలను నిర్మించింది. ఈ కంపెనీలో అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ సుమారు 4 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టేందుకు చర్చలు జరుపుతోందని వెల్లడైంది.

ప్రస్తుతం బెంగళూరు స్టార్టప్ డజనుకు పైగా దేశీయ భాషల్లో సంభాషణాత్మక AIని అందుబాటులోకి తీసుకొచ్చే పనుల్లో ముమ్మరంగా పనిచేస్తోంది. గూగుల్ ఇప్పటికే స్టార్టప్‌లో 5 లక్షల డాలర్ల ఈక్విటీయేతర నిధులను వాగ్దానం చేసింది. వీటిలో చాలా వరకు మార్చి నుంచి అందించబడగా.. మిగిలినవి డిసెంబర్ నాటికి అందుతాయి. తదుపరి వారాల్లో చాట్‌బాట్‌ను ప్రారంభించిన తర్వాత నాలుగు మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో గూగుల్ ఉన్నట్లు తెలుస్తోంది.
బెంగళూరు స్టార్టప్ కంపెనీ కోరోవర్ 2016లో స్థాపించబడింది. ప్రస్తుతం కంపెనీ తన ఫండింగ్‌ను కాన్‌బ్యాంక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్, లీడ్ ఏంజిల్స్, కాగ్నిఫై, కరేకేబా వెంచర్స్, IIIT-ఢిల్లీ వంటి సంస్థల నుంచి పొందింది. భారతీయ, విదేశీ భాషల్లో టెక్స్ట్, ఆడియో, వీడియో చాట్‌బాట్‌లను కంపెనీ అందిస్తోంది. ఈ చాట్‌బాట్‌ను వాట్సాప్, సిగ్నల్, జూమ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఏకీకృతం చేయవచ్చు.
కంపెనీకి బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్‌కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రావెల్, ఈ-కామర్స్ డొమైన్‌లలో క్లయింట్లు ఉన్నారు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం IRCTC, NPCI, ICICI ప్రుడెన్షియల్, ITC, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, బాష్ తో పాటు మరిన్ని కస్టమర్లను కలిగి ఉంది. డిసెంబర్ 2022 నాటికి Tracxn డేటా ప్రకారం కంపెనీ విలువ 8.5 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications