బయటకొస్తున్న టెక్ దిగ్గజాల రహస్యాలు.. ఆపిల్‌కు ఏటా భారీగా చెల్లిస్తున్న గూగుల్.. ఎందుకంటే..?
Google news: అంతర్జాతీయ టెక్ దిగ్గజాల గుట్టు ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. ఇటీవల ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ కి సంబంధించిన పలు రహస్యాలు బయటకు వచ్చి పెద్ద దుమారం చెలరేగింది. కాగా తాజాగా గూగుల్ సీక్రెట్ ఒకటి బట్టబయలు అయింది.
ప్రస్తుతం జరుగుతున్న US vs Google కేసులో వివిధ రహస్యాలు బయట పడుతున్నాయి. Safari, iMac, iPhone ఉత్పత్తుల్లో గూగుల్ డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా ఉండేందుకు భారీ మొత్తంలో ఆపిల్ కు చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. ఈ డీల్ విలువ 18 బిలియన్ డాలర్ల మేర ఉండవచ్చని ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ నివేదించింది.

ఫోన్‌లు, బ్రౌజర్‌లతో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా ఉండటానికి 2021లోనే 26.3 బిలియన్ డాలర్లను చెల్లించడానికి Google అంగీకరించినట్లు మరో ప్రఖ్యాత సంస్థ తెలిపింది. తద్వారా ఆపిల్ మరో సెర్చ్ ఇంజిన్ ను రూపొందించకుండా గూగుల్ నిలువరించగలిగినట్లు పేర్కొంది. ఇదే తరహా డీల్స్ మొజిల్లా, శామ్ సంగ్ సహా పలు ఇతర ఫోన్ మేకర్స్‌తోనూ కుదుర్చుకుని ఉండవచ్చని అంచనా వేసింది.
కేవలం గూగుల్ ను డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గా ఉంచేందుకు ఇంత భారీ మొత్తం చెల్లించడం సరైనదేనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇటీవల దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఆదాయ నివేదికను చూస్తే కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే గత 3 నెలల్లో తమ గూగుల్ సెర్చ్ యాడ్ వ్యాపారం 44 బిలియన్ డాలర్లను ఆర్జించినట్లు పేర్కొంది. గతేడాదిలో ఇది 165 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు చెప్పింది.


Click it and Unblock the Notifications