గూగుల్ వార్తలు: నిలిచిపోయిన గూగుల్ పే సేవలు.. క్లారిటీ ఇచ్చిన టెక్ దిగ్గజం.. అదీ మ్యాటర్..
నగదు విత్‌డ్రా కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే అవసరం లేకుండా UPI ద్వారా సెకన్ల వ్యవధిలో చెల్లింపులు చేస్తున్నాము. దీని వెనుక పలు యాప్స్ నిర్విరామ కృషి, అవి అందిస్తున్న సౌకర్యాలు ఉన్నాయి. భారతీయ మార్కెట్లో ఫోన్ పే తర్వాత అత్యధిక షేర్ తో గూగుల్ పే వినియోగదారులకు సర్వీసు అందిస్తోంది. గతంలో పేటీఎం రెండో స్థానాన్ని ఆక్రమించగా ఇప్పుడు గూగుల్ దాన్ని రిప్లేస్ చేసింది.
కాగా నిన్నటి నుంచి గూగుల్ పే తన సేవలకు మంగళం పాడినట్లు వెల్లడించింది. అంటే ఇకపై గూగుల్ పే ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయలేరు అన్నమాట. ఈ వార్త తెలియడంతో వినియోగదాలలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఎంతోకాలం నుంచి అలవాటుపడిన, చాలా తేలికగా చెల్లింపులు చేసే యాప్ సడెన్‌గా మాయం అయిపోతుందని ఒకింత బాధ పడ్డారు.

అయితే ఈ విషయం గురించి గూగుల్ పూర్తి క్లారిటీ ఇచ్చింది. అమెరికా సహా మరికొన్ని దేశాల్లోనే తన సేవలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత్ వంటి కొన్ని ఇతర దేశాల్లో ఎటువంటి అంతరాయం లేకుండా తమ సేవలు వినియోగించుకోవచ్చని భరోసా ఇచ్చింది. దీంతో గూగుల్ యూజర్స్ హమ్మయ్యా అనుకున్నారు.
గూగుల్ పే తన సేవలను నిలిపేయడం వెనుక కారణం ఏమిటి అని చాలా మంది ఆలోచిస్తున్నారు. మరిన్ని సేవలను జోడించి గూగుల్ వాలెట్ ద్వారా ప్రజల్లోకి రావాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం 2 కాకుండా కేవలం ఒకే ఎంటిటీగా అమెరికా వంటి దేశాలలో పాగా వేయాలని చూస్తుంది. కానీ ఇండియాలో మాత్రం రెండూ కూడా విడివిడిగా తమ సేవలను కొనసాగిస్తాయని వివరించింది.


Click it and Unblock the Notifications