Google pay: ట్రెండ్ అవుతున్న గూగుల్ పే పాకెట్ మనీ ఫీచర్! ఇదెలా పని చేస్తుందంటే..
ప్రస్తుత రోజుల్లో చిల్లర కష్టాల కంటే యూపీఐ (UPI) ద్వారా డబ్బులు పంపడమే అందరికీ అలవాటైపోయింది. అయితే, ఇప్పటివరకు యూపీఐ వాడాలంటే కచ్చితంగా సొంత బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేకుండానే డిజిటల్ పేమెంట్స్ చేసుకునే వెసులుబాటును గూగుల్ పే (google pay) కల్పిస్తోంది. 'యూపీఐ సర్కిల్' (UPI Circle) లో భాగంగా 'పాకెట్ మనీ' అనే సరికొత్త ఫీచర్‌ను గూగుల్ లాంచ్ చేసింది. దీనివల్ల బ్యాంక్ అకౌంట్ లేని మీ కుటుంబ సభ్యులు లేదా పిల్లలు కూడా మీ అకౌంట్ ద్వారా సులభంగా పేమెంట్స్ చేయవచ్చు.

యూపీఐ సర్కిల్ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది?
ఈ ఫీచర్ ప్రకారం, ఒకరు 'ప్రైమరీ యూజర్' (Primary User) గా ఉంటారు. వీరు గరిష్టంగా ఐదుగురు 'సెకండరీ యూజర్లను' (Secondary Users) తమ యూపీఐ సర్కిల్‌లో చేర్చుకోవచ్చు. ఉదాహరణకు, మీ ఇంట్లో పిల్లలు, వృద్ధులు లేదా ఆఫీసు సిబ్బందికి బ్యాంక్ అకౌంట్ లేకపోయినా, వారు మీ అకౌంట్ నుంచి డబ్బులు చెల్లించేలా మీరు అనుమతి ఇవ్వవచ్చు. ఇది ముఖ్యంగా పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడానికి, పెద్దల అవసరాలకు డబ్బులు సర్దడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కంట్రోల్ మొత్తం మీ చేతుల్లోనే!
డబ్బులు మన అకౌంట్ నుంచి పోతాయి కాబట్టి, ఎక్కడ విపరీతంగా ఖర్చు చేస్తారో అనే భయం ఉండొచ్చు. కానీ గూగుల్ పే ఇందులో రెండు రకాల ఆప్షన్లను ఇచ్చింది:
1. పూర్తి అనుమతి (Full Delegation): మీరు నెలకు గరిష్టంగా ₹15,000 వరకు లిమిట్ సెట్ చేయవచ్చు. ఆ లిమిట్ లోపు వారు మీ పర్మిషన్ లేకుండానే స్వతంత్రంగా పేమెంట్స్ చేసుకోవచ్చు.
2. పాక్షిక అనుమతి (Partial Delegation): వారు చేసే ప్రతి పేమెంట్‌కు మీ ఫోన్‌కు ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఓకే అంటేనే ఆ ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. దీనివల్ల మీ అకౌంట్ సెక్యూర్డ్‌గా ఉంటుంది.
సెటప్ చేయడం ఎలా?
ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయడం చాలా సిలభం.
- ముందుగా గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి 'UPI Circle' ఆప్షన్‌కు వెళ్లండి.
- మీ కాంటాక్ట్స్ నుంచి సెకండరీ యూజర్‌ను ఎంచుకోండి లేదా వారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.
- మీకు నచ్చిన మోడ్ (ప్రతి పేమెంట్‌కు అనుమతి లేదా మంత్లీ లిమిట్) ఎంచుకోండి.
- మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ పంపండి. అవతలి వ్యక్తి దాన్ని యాక్సెప్ట్ చేయగానే సర్కిల్ యాక్టివేట్ అవుతుంది.
సౌకర్యమా లేక రిస్క్ ఉందా?
భారతదేశంలో డిజిటల్ లావాదేవీలను మరింత విస్తృతం చేయడంలో ఈ ఫీచర్ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలు తక్కువగా ఉన్న వారికి ఇది ఒక వరమని చెప్పవచ్చు. అయితే, సెకండరీ యూజర్లను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నమ్మకమైన కుటుంబ సభ్యులను మాత్రమే చేర్చుకోవడం వల్ల రిస్క్ ఉండదు. అలాగే, లిమిట్స్ సెట్ చేయడం ద్వారా మీ ఆర్థిక బడ్జెట్‌ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మొత్తం మీద గూగుల్ పే (google pay) తీసుకొచ్చిన ఈ 'పాకెట్ మనీ' ఫీచర్ స్మార్ట్ పేమెంట్స్ ప్రపంచంలో ఒక గొప్ప ముందడుగు.


Click it and Unblock the Notifications