మీరు ఏదైనా కొనడానికి లేదా ఎవరికైనా డబ్బులు సెండ్ చేయడానికి పేమెంట్ చేసేటప్పుడు అకస్మాత్తుగా మీ Google Pay లేదా PhonePe పనిచేయకపోతే మీకు ఎలా అనిపిస్తుంది ? మొదట్లో కోపం వచ్చిన తరువాత ఇలా ఎందుకు అయ్యింది అని ఆలోచిస్తారు. ఇందుకు కారణం ఏంటి అని కూడా తెలుసుకోవడానికి ప్రత్నిస్తారు. కానీ మీ బ్యాంక్ అకౌంట్ పాత లేదా ఇన్ యాక్టీవ్ అంటే ఉపయోగించని మొబైల్ నంబర్‌కు లింక్ చేసి ఉంటే ఏప్రిల్ 1 నుండి ఇదే జరుగుతుంది.
ఎందుకంటే సైబర్ మోసాలను అరికట్టడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ పెద్ద నిర్ణయం తీసుకుంది. మీరు నంబర్ మార్చిన లేదా చాలా కాలంగా ఉపయోగించకుండా ఉన్నా నంబరుని వెంటనే బ్యాంకుకు వెళ్లి అప్‌డేట్ చేసుకోండి లేకుంటే ఆ నంబర్ పై ఉన్న UPI సేవలు నిలిపివేయవచ్చు.

ఏప్రిల్ 1 నుండి మారనున్న UPI రూల్స్: హిందూస్తాన్ టైమ్స్ నివేదికల ప్రకారం మీ బ్యాంక్ అకౌంట్ చాలా కాలంగా ఉపయోగించని మొబైల్ నంబర్‌కు లింక్ చేసి ఉంటే ఆ నంబర్ పై ఇక UPI పనిచేయదు. అంటే మీరు Google Pay, PhonePe లేదా Paytm వంటి యాప్‌లతో ఆ నంబర్‌తో ఎలాంటి ట్రాన్సక్షన్ చేయలేరు. సైబర్ మోసాలని నిరోధించడానికి అండ్ బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సురక్షితంగా చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ రూల్స్ రూపొందించింది. మీ బ్యాంక్ అకౌంట్ పాత లేదా ఉపయోగించని మొబైల్ నంబర్‌కు లింక్ చేసి ఉంటే, వీలైనంత త్వరగా దాన్ని అప్‌డేట్ చేసుకోండి, తద్వారా UPI సేవలకి ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి.
సైబర్ నేరాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం: ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాల కేసులను దృష్టిలో ఉంచుకుని NPCI ఈ నిర్ణయం తీసుకుంది. చాలా సార్లు టెలికాం కంపెనీలు పాత అలాగే వాడుకలో లేని మొబైల్ నంబర్లను కొత్త కస్టమర్లకు ఇస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నంబర్ గతంలో బ్యాంక్ అకౌంట్ లేదా UPIకి లింక్ చేసి ఉంటే దాని సమాచారం కొత్త వ్యక్తికి చేరుతుంది, దీని ద్వారా మోసాలు జరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, ఇలాంటి ఇన్ అక్టీవ్ నంబర్లు బ్యాంకింగ్ ఇంకా UPI వ్యవస్థలో టెక్నికల్ సమస్యలను కూడా కలిగిస్తాయి. అందువల్ల, ఆన్‌లైన్ ట్రాన్సక్షన్ మరింత సురక్షితంగా ఉండేలా ఇలాంటి పాత, ఇన్ ఆక్టివ్ లేదా వాడని మొబైల్ నంబర్‌లను సిస్టమ్ నుండి తొలగించాలని NPCI అన్ని బ్యాంకులు అలాగే UPI సేవలను ఆదేశించింది.
కస్టమర్లు వెంటనే నంబర్‌లను చెక్ చేసుకోవాలి: మీరు మీ బ్యాంక్ అకౌంటుకు లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను చాలా కాలంగా ఉపయోగించకపోతే మీరు వెంటనే దాన్ని చెక్ చేయాలి. మీ నంబర్ డిఅక్టీవ్ లేదా మీరు చాలా కాలంగా రీఛార్జ్ చేయకపోతే దాన్ని మళ్ళీ ఆక్టివేట్ చేసుకోండి. మీ దగ్గర ఆ నంబర్ లేకపోతే వెంటనే బ్యాంకును సంప్రదించి, మీ అకౌంట్ కొత్త మొబైల్ నంబర్‌తో అప్‌డేట్ చేసుకోండి. దీని వల్ల మీ UPI లావాదేవీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగేలా చేస్తుంది.
బ్యాంకులకు కఠినమైన సూచనలు: ప్రతి వారం ఇన్ అక్టీవ్ మొబైల్ నంబర్‌లను చెక్ చేసి, వాటి రికార్డులను అప్ డేట్ చేయాలనీ NPCI బ్యాంకులు అలాగే UPI యాప్ కంపెనీలను కోరింది. దీనితో పాటు ఎవరూ ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండటానికి కస్టమర్లకి దీని గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని కూడా కోరారు. కాబట్టి, మీరు ఎటువంటి అంతరాయం లేకుండా UPI సెవలు ఉపయోగించాలనుకుంటే, మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను త్వరగా చెక్ చేసి దానిని ఆక్టివ్‌గా ఉంచుకోండి.


Click it and Unblock the Notifications