Gold Loan: రూ.50 లక్షల వరకు గూగుల్ పే గోల్డ్ లోన్స్.. పర్సనల్ లోన్స్ మెగా మాస్టర్ ప్లాన్..
GPay Gold Loan: భారతదేశంలో యూపీఐ చెల్లింపుల వ్యాపారంలో అగ్ర ఆటగాళ్లలో ఒకటైన గూగుల్ పే కస్టమర్ల కోసం సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో గూగుల్ 10వ వార్షిక ఈవెంట్ 'గూగుల్ ఇండియా ఈవెంట్'లో భారతదేశం కోసం భారీ ప్రకటన చేసింది. సరసమైన వడ్డీ రేట్లకు రుణసౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
ఈ క్రమంలో గూగుల్ పే యూజర్లు గోల్డ్ లోన్స్ కింద అత్యధికంగా రూ.50 లక్షల వరకు రుణాన్ని అందుకోగలరని వెల్లడించింది. దీనికోసం గూగుల్ ఇప్పటికే దేశీయ గోల్డ్ లోన్ ఆటగాడు ముతూట్ ఫైనాన్స్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా చిన్న వ్యాపారులు, కస్టమర్లతో పాటు ప్రధానంగా గ్రామీణ భారతంలోని ప్రజలకు బంగారు ఆభరణాలు, కాయిల్స్ పై రుణాలను అందించనుంది. ఈ క్రమంలో రుణాన్ని పొందే ఖాతాదారులు తనఖా పెట్టే బంగారం స్టోరేజ్, భద్రత పూర్తి బాధ్యత ముతూట్ సంస్థ చూసుకుంటుందని వెల్లడించింది. ఈ క్రమంలో గూగుల్ కేవలం కస్టమర్లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు మధ్య వారధిగా మాత్రమే పనిచేస్తుందని స్పష్టం చేసింది. గోల్డ్ లోన్ మార్కెట్ భారతదేశంలో మంచి ఆదరణ కలిగి ఉందని గూగుల్ పే ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ శరత్ బులుసు పేర్కొన్నారు.

ప్రపంచంలోని బంగారంలో దాదాపు 11 శాతం భారతదేశంలోనే ఉన్న నేపథ్యంలో గోల్డ్ లోన్ కేటగిరీపై కంపెనీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అలాగే గూగుల్ పే కొలేటరల్ అవసరం లేని పర్సనల్ లోన్స్ కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రుణాల పరిమితిని భారీగా పెంచుతూ రూ.5 లక్షల వరకు లోన్స్ అందించనున్నట్లు గూగుల్ పే వెల్లడించింది. ఇందుకోసం కంపెనీ ఫెడరల్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, DMI ఫైనాన్స్ వంటి భాగస్వామ్య బ్యాంకుల ద్వారా రుణాలను ఆఫర్ చేస్తోంది. ఇక్కడ వడ్డీ రేట్లు 15 శాతం నుంచి ప్రారంభమవుతాయి. పర్సనల్ లోన్ కాలపరిమితి 6-36 నెలల మధ్య ఉంటుంది. క్రెడిట్ బ్యూరోల వద్ద ఎలాంటి హిస్టరీ లేని వినియోగదారులకు క్రెడిట్‌ని నిర్వహించే అనుభవం లేదు కాబట్టి వారు జాగ్రత్తగా వెల్లాలి.
గూగుల్ ఫర్ ఇండియా 10వ కార్యక్రమంలో AI అసిస్టెంట్ జెమిని లైవ్ హిందీలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. రానున్న కొద్ది రోజుల్లో ఇది మరో 8 భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. AI అసిస్టెంట్ జెమిని లైవ్‌కి సంబంధించి, 40 శాతం మంది జెమిని యూజర్లు వాయిస్ ఇంటరాక్షన్‌లపై ఆధారపడుతున్నారని గూగుల్ ఇండియా ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ సీనియర్ డైరెక్టర్ హేమ బూదరాజు తెలిపారు. ఇదే క్రమంలో గూగుల్ సర్కిల్స్ సౌకర్యం సైతం యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications