Google Pay: గూగుల్ పే సూపర్ లోన్.. నెలకు రూ.111 ఈఎంఐ.. రూ.15 వేల లోన్..
Google Pay: భారత సంతతి సీఈవో సుందర్ పిచాయ్ నేతృత్వంలో గూగుల్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సంస్థ గూగుల్ పే పేరుతో భారతదేశంలో తన డిజిటల్ టెల్లింపుల వ్యవస్థను కలిగి ఉంది.
ఈ క్రమంలో Google Pay దేశంలోని ప్రజల పేమెంట్స్ సమాచారాన్ని సేకరించే కొత్త లోన్ స్కీమ్ సేవను ప్రవేశపెట్టింది. ఇది చిన్న వ్యాపారాలు, సంస్థలకు సహాయం చేయటానికి గూగుల్ పే యాప్ ద్వారా సాచెట్ లోన్‌లను అందించనున్నట్లు గురువారం ప్రకటించింది. అత్యవసర సమయంలో అవసరాలను తీర్చుకునేందుకు ఈ లోన్స్ ఎంతగానో దోహదపడనున్నాయి. దీని ద్వారా కంపెనీ దేశంలో రిటైల్ లోన్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది.

భారతదేశంలోని వ్యాపారులకు తరచుగా చిన్న రుణాలు అవసరమవుతుంటాయని అందరికీ తెలిసిందే. అయితే వీరు ప్రతిసారి బ్యాంకుల నుంచి రుణాలను పొందటం కష్టతరంగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న అవసరాల కోసం ఇకపై గూగుల్ పే ద్వారా తీర్చుకోవచ్చు. అలాగే మార్కెట్లు ఉన్న ఈ చిన్న గ్యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని గూగుల్ నిర్ణయించింది. అలాగే వ్యక్తులకు వ్యక్తిగత రుణాలను అందించడానికి రుణదాతను అనుమతించడానికి టెక్ మేజర్ యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. అంటే కాకుండా ఐసీఐసీఐతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది.
సాచెట్ లోన్ కింద గూగుల్ రూ.15,000 రుణం రూపంలో చిన్న వ్యాపార యజమానులకు అందించాలని నిర్ణయించింది. రుణం పొందిన వ్యక్తులు దీనికి కేవలం నెలకు రూ.111 చెల్లింపు చేస్తే సరిపోతుంది. ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావటం కోసం గూగుల్ DMI ఫైనాన్స్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. చిన్న వ్యాపారులు కొన్ని సార్లు ఎదుర్కొనే వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చేందుకు గూగుల్ పే ePayLaterతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇది ఆన్ లైన్, ఆఫ్ లైన్ కొనుగోళ్లకు మద్దతును ఇస్తుంది.


Click it and Unblock the Notifications