International Payments: మార్కెట్‌లోని ఇతర ప్లేయర్స్‌తో పోలిస్తే టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన పేమెంట్స్ ప్లాట్‌ఫారమ్ గూగుల్ పే కొంతమేర వెనకబడి ఉంది. అయితే ఇక మీదట అంతర్జాతీయ మార్కెట్లో మెరుపు వేగంతో దూసుకుపోయేందుకు సిద్ధమైంది.
విదేశాలకు వెళ్లే వినియోగదారులు ఇకమీదట అక్కడి స్థానిక వ్యాపారులకు గూగుల్ పే ఉపయోగించి UPI ద్వారా ఆ దేశ కరెన్సీలో చెల్లించగలరు. దీంతో అంతర్జాతీయ కార్డుల (డెబిట్/క్రెడిట్/ఫారెక్స్) అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ సౌకర్యం సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, USA, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లలో అందుబాటులో ఉంది.

ఫోన్ పే, పేటీఎం తర్వాత ఇప్పుడు గూగుల్ తన ఆన్‌లైన్ చెల్లింపు అగ్రిగేటర్ గూగుల్ పే ను అప్‌డేట్ చేసింది. తద్వారా విదేశాలకు వెళ్లే వినియోగదారులకు కూడా యూపీఐ(UPI) సేవలను అందిస్తోంది. డిజిటల్ చెల్లింపుల సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుబంధ NPCI పేమెంట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (NPIL)తో కలిసి ఈ సర్వీసెస్‌ను మరింత డెవలప్ చేసేందుకు పని చేస్తోంది.
'అంతర్జాతీయ మార్కెట్‌లకు UPI పరిధిని విస్తరించేందుకు NIPLకు మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉంది. రెగ్యులేటర్ మార్గదర్శకత్వంలో NPCI మరియు ఆర్థిక పర్యావరణ వ్యవస్థకు గూగుల్ పే సహకారిగా ఉండటం మాకు గర్వకారణం. సరళ, సురక్షిత మరియు సౌకర్యవంతమైన పేమెంట్స్ నిర్వహించడంలో మా నిబద్ధతకు ఇది మరో మెట్టు' అని గూగుల్ పే ఇండియా పార్ట్‌నర్‌షిప్స్ డైరెక్టర్ దీక్షా కౌశల్ తెలిపారు.


Click it and Unblock the Notifications