కస్టమర్ల ఖాతాల్లోకి డబ్బులేస్తున్న Google Pay.. కొంత మందికి రూ.88 వేలు.. మీకూ వచ్చిందా..?
Google Pay: గూగుల్ పే యూజర్ల ఖాతాల్లోకి అకస్మాత్తుగా డబ్బులు వచ్చి పడుతున్నాయి. దీంతో చాలా మందికి అసలు ఏం జరుగుతుందో అస్సలు తెలియటం లేదు. చాలా మంది రెడ్డిట్ వినియోగదారులు తమ ఖాతాల్లో ఊహించని విధంగా డబ్బు క్రెడిట్ అయ్యిందని తెలిపారు.
ఈ క్రమంలో కొంత మంది ఖాతాల్లో ఏకంగా 1,072 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.88,000 వచ్చాయి. అయితే కంపెనీ కొత్త ఫీచర్లను లాంచ్ చేయటానికి ముందు చేసిన పరీక్షల్లో భాగంగా ఇది జరిగిందని తెలుస్తోంది. సాంకేతిక లోపం కారణంగా దీనికి కారణంగా గుర్తించారు. ఈ క్రమంలో గూగుల్ కంపెనీ నుంచి కొంత మందికి ఇప్పటికే ఈ-మెయిల్స్ వచ్చాయని వెల్లడైంది.

ఇప్పటి వరకు ఎంత మంది వినియోగదారులు అనుకోకుండా డబ్బు క్రెడిట్‌లను అందుకున్నారనేది అస్పష్టంగా ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో కొంత మందికి చిన్న మెుత్తంలో డబ్బు క్రెడిట్ కాగా.. మరికొందరికి మాత్రం 1000 డాలర్ల కంటే ఎక్కువ మెుత్తం వచ్చి చేరింది. అయితే ఈ మెుత్తాన్ని తిరిగి రివర్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. అయితే అలా చేయలేని పక్షంలో నగదును తమ వద్దే ఉంచుకోవాలి.
ప్రస్తుతం ఈ తప్పిదం వల్ల డబ్బు కేవలం గూగుల్ పిక్సిల్ యూజర్లకు మాత్రమే డబ్బు వెళ్లిందా లేక Android యూజర్లకు సైతం జరిగిందా అనేది ఇప్పటి వరకు తెలియదు. మీరు ఉచిత క్రెడిట్‌ని పొందిన అదృష్ట Pixel వినియోగదారుల్లో ఒకరయితే.. మీరు డబ్బును ఉంచుకోవచ్చా లేదా అనేది అస్పష్టంగా ఉంది. అయితే సమస్యపై Google ప్రతిస్పందనను గమనిస్తే.. కంపెనీ చెల్లింపును రివర్స్ చేయలేకపోతే మీరు నగదును ఉంచుకోవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications