Google Pay: ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ తెచ్చిన యూపీఐ వ్యవస్థ అత్యంత ప్రభావవంతమైనది, సులువైనదిగా గుర్తింపు పొందింది. ప్రజలు సైతం వేగంగా డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లేందుకు ఇది దోహదపడింది.
ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులను అనేక సంస్థలు అందిస్తున్నాయి. అయితే రద్దీ వల్ల కొన్ని సార్లు ట్రాన్సాక్షన్స్ నెమ్మదిగా ప్రాసెస్ అవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు గూగుల్ పే గురువారం మరో కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. దీనికి UPI LITE అని పేరు పెట్టారు. ఇది Google Pay వంటి అన్ని లక్షణాలను కలిగి ఉంది. అయితే కొన్ని పరిమితులను కలిగి ఉంది. కానీ చాలా అధునాతన సాంకేతికతలు ఉన్న దీని ద్వారా కేవలం ఒక క్లిక్‌లో చెల్లింపు చేయవచ్చు. UPI పిన్ లేకుండానే లావాదేవీలను పూర్తి చేయవచ్చని కంపెనీ తెలిపింది.

ఈ UPI LITE వినియోగదారు బ్యాంక్ ఖాతాకు లింక్ అవుతుంది.. కానీ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌కు లింక్ చేయబడదు. ఈ సాంకేతికత వల్ల సైబర్ మోసాలకు దూరంగా ఉండవవచ్చని కంపెనీ వెల్లడించింది. సురక్షితమైన చెల్లింపుల వ్యవస్థను సిద్ధం చేయటంలో భాగంగా గూగుల్ కొత్త సాంకేతికను డిజిటల్ చెల్లింపుల్లోకి తీసుకొచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇతర చెల్లింపు సంస్థలు సైతం ఇదే తరహా చెల్లింపు వ్యవస్థలను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయని తెలుస్తోంది.
వినియోగదారులు UPI LITE ఖాతాలో రోజుకు రెండుసార్లు రూ.2000 వరకు లోడ్ చేసుకోవటానికి వెసులుబాటు ఉంటుంది. మీరు ఒకేసారి రూ.2000 వరకు చెల్లించవచ్చు. తద్వారా మీ బ్యాంకు ఖాతా నుంచి పొరపాటున ఎక్కువ డబ్బు తగ్గే ప్రమాదం నుంచి రక్షించబడతారు. ఇందులోని మరో అంశం ఏమిటంటే.. ఇటువంటి సాంకేతికత లేదా ఫీచర్లు సైబర్ మోసాన్ని నివారించడంలో ఎంతగానో సహాయపడతాయి. సైబర్ నేరగాళ్లు మీ యూపీఐ లైట్ ఖాతా నుంచి డబ్బు తస్కరించటం అస్సలు కుదరదు.


Click it and Unblock the Notifications