బెంగళూరులో గూగుల్ భారీ కొత్త క్యాంపస్ "ఆనంత"ను ప్రారంభించింది. టెక్నాలజీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న గూగుల్, ఈ క్యాంపస్‌ను వృద్ధి ప్రయాణంలో ఒక మైలురాయిగా నిర్మించుకుంది. ఈ క్యాంపస్ ఈస్ట్ బెంగళూరులోని మహాదేవపుర ప్రాంతంలో ఉంది. ఈ కొత్త సముదాయం ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతదేశం కీలకమైన దేశం కాబట్టి ఇంకా లక్షలాది మందిని సహా స్థానిక వ్యాపారాలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి గూగుల్ ఈ ఆఫీస్ నిర్మించడానికి బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టింది. సంస్కృతంలో "ఆనంత" అంటే అపరిమితమైనది. ఈ కాంప్లెక్స్ 1.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది అలాగే 5,000 మందికి పైగా ఉద్యోగులను నియమించగలదు.
అయితే బెంగళూరులోని కొత్త అనంత క్యాంపస్ మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది, ఇది AIతో జరుగుతున్న సాంకేతిక నమూనా మార్పును సూచిస్తుంది అని గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానా అన్నారు.

ఈ ఆఫీస్లో ఆండ్రాయిడ్, సెర్చ్, మ్యాప్స్, గూగుల్ డీప్‌మైండ్ వంటి గూగుల్‌లోని వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు ఉంటారని చెబుతున్నారు. ఆనంత కార్యాలయం ప్రధానంగా ఇతర ఉద్యోగులతో విశాలమైన చర్చలను సులభతరం చేయడానికి రూపొందించబడింది, అదే సమయంలో ఉద్యోగులు వారికి కేటాయించిన పనులను పూర్తి చేయడానికి స్పెస్ కూడా అందిస్తుంది. క్యాంపస్‌లో వాకింగ్ జిమ్ ఇంకా జాగింగ్ ట్రాక్‌లు కూడా ఉన్నాయి. ఈ కార్యాలయంలో భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ అమర్చబడింది. దీనికి ఉపయోగించిన నీటిని 100% రీసైకిల్ చేసే సౌలభ్యం కూడా ఉంది. అదనంగా వర్షపు నీటి సంరక్షణ సౌకర్యాలు అందించింది.
భారతదేశంలో గూగుల్'కు బిలియన్'కు పైగా యూజర్లు ఉన్నారు. కాబట్టి గూగుల్ భవిష్యత్ వృద్ధికి సహాయపడటానికి ఈ ముఖ్యమైన అడుగు వేసింది. ఇటీవలి సంవత్సరాలలో గూగుల్ వివిధ ఉత్పత్తులలో కొన్ని కీలక లక్షణాలను మెరుగుపరచడానికి కృషి చేస్తోంది. 2024లో గూగుల్ పెద్ద ఎత్తున పునర్నిర్మాణ ప్రయత్నంలో భాగంగా US నుండి అనేక మంది టెక్నికల్ అండ్ ఇంజనీరింగ్ ఉద్యోగులను భారతదేశానికి మార్చింది. ప్రస్తుతం, 10,000 మందికి పైగా ఉద్యోగులతో భారతదేశం అమెరికా తర్వాత కంపెనీకి అతిపెద్ద ఉద్యోగుల స్థావరాలలో ఒకటి. బెంగళూరుతో పాటు, గూగుల్'కు గురుగ్రామ్, హైదరాబాద్, ముంబై ఇంకా పూణేలో కూడా కార్యాలయాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications