Google Meet: రెండు కొత్త ఫీచర్లు..లైవ్ స్ట్రీమ్‌లో ఆ ఆప్షన్లు..క్యాప్షన్లు!
వాషింగ్టన్: టాప్ సెర్చ్ ఇంజిన్ గూగుల్.. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని పుణికి పుచ్చుకుంటూనే వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏర్పడిన డిమాండ్‌కు అనుగుణంగా అప్‌డేట్ అవుతోంది. సాఫ్ట్‌వేర్ సహా దాదాపు అన్ని సెక్టార్లకు చెందిన కార్యాలయాలు మూతపడటం.. ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పరిమితమైన నేపథ్యంలో- గూగుల్ మీట్ (Google Meet)కు డిమాండ్ ఏర్పడింది..ఎంప్లాయిస్‌తో మాట్లాడటానికి దీనిమీదే డిపెండ్ కావాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గూగుల్ యాజమాన్యం.. దీన్ని మరింత అప్‌డేట్ చేసింది. కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రస్తుతం గూగుల్ మీట్ ద్వారా ఏకకాలంలో లక్షమంది సమావేశం కావడానికి అవకాశం ఉన్న విషయం తెలిసిందే. గూగుల్ మీట్‌ను హోస్ట్ చేసిన వ్యక్తి.. మరో కొత్త డొమైన్ ద్వారా మరింత మందిని ఈ సమావేశానికి ఆహ్వానించే ఛాన్స్ ఇప్పటిదాకా ఉండేది కాదు. గూగుల్ మేనేజ్‌మెంట్ తాజాగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. లైవ్ స్ట్రీమ్ ఒకవంక కొనసాగిస్తూనే- గూగుల్ మీట్ హోస్ట్.. కొత్త డొమైన్ ద్వారా మరింత మందిని ఈ సమావేశానికి ఆహ్వానించే వెసలుబాటును కల్పించింది. కొత్త ఫీచర్ల వల్ల క్రాస్ డొమైన్ లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి వీలు ఉంటుంది.

ఒక పేజ్ డొమైన్‌లో లైవ్ స్ట్రీమింగ్ కొనసాగుతోన్న సమయంలో.. అదే లైవ్ స్ట్రీమింగ్‌ను క్రాస్ డొమైన్ ద్వారా ప్రసారం చేసే అవకాశం ఉంది. దీనితో పాటు క్యాప్షన్స్‌ను కూడా జత చేసే వీలు కలగజేసింది. వినికిడి లోపం ఉన్న వారికి, సౌండ్ అలర్జీకి గురయ్యే వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ క్యాప్షన్లను జత చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది గూగుల్ యాజమాన్యం. అలాగే- ఆడియో ఆఫ్ చేసిన తరువాత కూడా ఆ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి క్యాప్షన్ల సౌకర్యం దోహదపడుతుందని పేర్కొంది.



Click it and Unblock the Notifications