Google Maps: ఇంటర్నెట్‌పై ఇంతకాలం పెత్తనం చెలాయించిన గూగుల్ హవా క్రమేపీ బలహీనపడుతోంది. భారతీయులు సహా మోదీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారీ పెనాల్టీ విధించడం నుంచి సంస్థ పతనం మొదలైంది. ఇటీవల ఓలా CEO అనౌన్స్‌మెంట్ ఇప్పుడు టెక్ దిగ్గజాన్ని మరింత ఆందోళనలోకి నెట్టింది. దీంతో వడివడిగాఉపశమన చర్యలకు దిగింది.
గూగుల్‌కు సంబంధించిన టెక్నాలజీల్లో పల్లెల నుంచి పట్టణాలు, నగరాల వరకు ప్రతి ఒక్కరూ రోజూ సాధారణంగా ఉపయోగించే సర్వీస్ మ్యాప్స్. వ్యక్తిగత నావిగేషన్ అవసరాలే కాకుండా ఇ-కామర్స్ సంస్థలు మరియు ఫుడ్ డెలివరీలు కూడా గూగుల్ మ్యాప్స్ ద్వారా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. మార్కెట్లో దీనికి ధీటైన సర్వీసు లేకపోవడంతో అప్‌గ్రేడ్‌లు, కొత్త సేవల పరిచయం మందకోడిగా సాగేది. తాజాగా ఓలా మ్యాప్స్ రంగంలోకి దిగడంతో ఉన్నపళంగా గూగుల్ తన మ్యాప్స్‌లో సరికొత్త ఆప్షన్స్ పొందుపరిచి, కస్టమర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.

ప్రయాణికులు మరియు వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి గూగుల్ మ్యాప్స్ భారత్‌లో 6 కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్లు వంటి ఫోర్ వీలర్స్ వెళ్లేందుకు అనువైన రోడ్లను గుర్తించి, ప్రయాణీకులను అలర్ట్ చేసేందుకు గూగుల్ AI టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఎప్పటినుంచో యూజర్స్ డిమాండ్ చేస్తున్న ఫ్లైఓవర్ ఇండికేషన్ ఇబ్బందులను తీర్చేందుకు ఫ్లైఓవర్‌లను హైలెట్ చేసే ఫీచర్ పొందపరిచింది.
కొచ్చి మరియు చెన్నైలలో వినియోగదారులు ఇప్పుడు నేరుగా గూగుల్ మ్యాప్స్, ONDC మరియు నమ్మ యాత్రితో అనుసంధానం ద్వారా మెట్రో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. పెరుగుతున్న EV వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని మ్యాప్స్ మరియు సెర్చ్‌లో 8 వేలకు పైగా ఛార్జింగ్ స్టేషన్ల వివరాలను అప్‌డేట్ చేసింది. లైవ్ అవైలబిలిటీ, ఛార్జర్ రకం ద్వారా వాటిని ఫిల్టర్ చేసుకునే సదుపాయాన్ని పరిచయం చేసింది. ప్రధాన నగరాలు, పర్యాటక ప్రదేశాలలోని సిఫార్సు చేయబడిన స్థలాలను క్యూరేట్ చేస్తోంది. రోడ్డుపై జరిగే ఇన్సిడెంట్ రిపోర్టింగ్‌ను మరింత మెరుగ్గా మార్చింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications