Work from office: మార్చి నెల ముగియటంతోనే అన్ని కంపెనీల్లో ఉద్యోగులు హైక్స్ కోసం ఎదురుచూస్తున్నారు. యాజమాన్యాలు ఈ సారి జీతం ఎంత పెంచుతాయనే ఆతృతలో ఉన్నారు.
ఈ క్రమంలో అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగుల పనితీరు లెక్కించేందుకు వారి కార్యాలయ హాజరును పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించింది. అంటే ఆఫీసులకు వచ్చే వారికే కంపెనీ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో తరచుగా గైర్హాజరయ్యే ఉద్యోగులకు కంపెనీ ఇటీవల రిమైండర్‌లను పంపుతూ.. వారిని తిరిగి కార్యాలయానికి రావాలని కోరుతోందని వెల్లడైంది.

టెక్ దిగ్గజం ప్రస్తుతం 'వర్క్ ఫ్రమ్ ఆఫీస్' విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. కంపెనీ మార్చితో తిరిగి తన హైబ్రిడ్ వర్క్ పాలసీని అప్‌డేట్ చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులకు తప్పకుండా రావాల్సి ఉంటుంది. అయితే వర్క్-ఫ్రమ్-హోమ్ ఎంపికను ఎంచుకున్న ఉద్యోగులకు మాత్రమే ఇవ్వబడుతుందని చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫియోనా సిక్కోని వెల్లడించారు. "There's just no substitute for coming together in person" అంటూ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ లో వెల్లడించారు.
వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులో గడిపే వారు ఇతర గూగ్లర్‌లతో ఎక్కువగా కనెక్ట్ అయ్యారని మెయిల్ లో పేర్కొన్నారు. ఒకే గదిలో కలిసి పనిచేయటం సానుకూల మార్పును కలిగిస్తుందనటంలో సందేహం లేదని అభిప్రాయపడ్డారు. వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి పనిచేయటం వల్ల వ్యక్తిగతంగా ఉద్యోగులు పొందే ప్రయోజనాన్ని అందించేందుకు హైబ్రిడ్ విధానాన్ని కంపెనీ తెచ్చినట్లు ఒక ప్రతినిధి వెల్లడించారు.
ప్రస్తుతం ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలిపించే పనిలో కేవలం గూగుల్ మాత్రమే కాదు అనేక సంస్థలు ఉన్నాయి. ప్రఖ్యాత అమెరికా సంస్థ సేల్స్ ఫోర్స్ తన ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించేందుకు ఒక ఆఫర్ ప్రకటించింది. ఆఫీసులకు వచ్చే ఉద్యోగి బదులుగా రోజుకు 10 డాలర్లను ఛారిటీకి అందిస్తామని యాజమాన్యం ప్రకటించింది. అలాగే తొలగింపులు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ 2,000 మంది అమెజాన్ ఉద్యోగులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications