ఒక సంస్థ అద్దె రూపంలోనే నెలకు రూ.4 వేల కోట్లకు పైగా చెల్లిస్తోంది. అదేదో మామూలు సంస్థ కాదు.. ప్రపంచ దిగ్గజ కంపెనీ గూగుల్. గూగుల్ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని అలెంబిక్ సిటీలో 649,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని గూగుల్ లీజుకు తీసుకుంది. చదరపు అడుగుకు రూ. 62 నెలవారీ అద్దె రేటుతో కార్యాలయాన్ని మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో లీజుకు తీసుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అంటే నెలకురూ. 4,02,38,000 అద్దె చెల్లిస్తోంది గూగుల్.
2022లో గూగుల్ కనెక్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో 600,000 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కోసం లీజును పునరుద్ధరించింది. బెంగళూరులోని బాగ్‌మనే డెవలపర్స్ నుండి 1.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు ఇవ్వడానికి కూడా గూగుల్ అంగీకరించింది. 2020 నుంచి భారతదేశంలో గూగుల్ ఆఫీస్ స్పేస్ పోర్ట్‌ఫోలియో 3.5 మిలియన్ చదరపు అడుగుల మేర విస్తరించింది. కంపెనీ ఇప్పుడు భారతదేశంలోని ఐదు నగరాల్లో 9.3 మిలియన్ చదరపు అడుగుల రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

తయారీ రంగంలోకి దిగడం ద్వారా గూగుల్ భారతదేశంలో తన ఉనికిని మరింత విస్తరిస్తోంది. తమిళనాడులోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీలో స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయాలని, ఇతర రాష్ట్రాల్లో డ్రోన్ తయారీని ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. భారతదేశంలో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తి పిక్సెల్ 8 మోడల్‌తో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. కంపెనీ కొన్ని స్థానాలను భారత్‌కు మార్చినట్లు సమాచారం. గతేడాది జరిగిన గూగుల్ ఫర్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
More From GoodReturns

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

ఉచితంగా AI కోర్సులు నేర్చుకునే అవకాశం! ఎలా రిజిస్టర్ అవ్వాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications