Sundar Pichai: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గూగుల్ ఉద్యోగుల తొలగింపులను ఇటీవల ప్రకటించింది. దాదాపు ఆల్ఫాబెట్ మెుత్తం ఉద్యోగుల్లో 6 శాతం మందిని తొలగించింది. ఈ నిర్ణయంపై స్పందించిన సుందర్ పిచాయ్ ఈ తొలగింపుల నిర్ణయం మరింత అధ్వాన్నమైన సమస్యల నుంచి కంపెనీని కాపాడిందని తెలిపారు.
కోతలు పెంచాలంటూ..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గూగుల్ వేల మంది 'ఓవర్‌పెయిడ్' ఉద్యోగులను తొలగించాలని హెడ్జ్ ఫండ్ బిలియనీర్ క్రిస్టోఫర్ హోహ్న్ సుందర్ పిచాయ్‌కి సలహా ఇచ్చారు. గత వారం కంపెనీ 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నాట్లు ప్రకటించింది. కంపెనీలో అవసరాని కంటే ఎక్కువ మందిని కంపెనీ కలిగి ఉందని మెుత్తం వర్క్ ఫోర్స్ లో 20 శాతం మందిని తగ్గించాలని క్రిస్టోఫర్ హెచ్చరించారు. ఉద్యోగుల తొలగింపులపై కంపెనీ నిర్ణయం సరైన దిశలో వేసిన ఒక అడుగని తన ట్వీట్ లో రాశారు.

2021 చివరికి..
లెక్కల ప్రకారం 2021 చివరినాటికి గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ దాదాపుగా 1,50,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ దీనికంటే 20 శాతం మంది ఉద్యోగులను అధికంగా కలిగి ఉందని తెలుస్తోంది. ఆర్థిక అస్థిరతల నుంచి కంపెనీని రక్షించేందుకు ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకోవాలంటూ నవంబర్ 2022లో ఇన్వెస్టర్ Hohn ఒక లేఖ రాశారు.

అధిక జీతాలు..
గూగుల్ అత్యధిక జీతాలను అందుకుంటున్న సగటు ఉద్యోగికి దాదాపుగా 3 లక్షల డాలర్లను అందిస్తోంది. ఇది కంపెనీపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతుందని Hohn తెలుపారు. అమెరికా టెక్ దిగ్గజాలు గత సంవత్సరంలో మెుత్తంగా 70,000 మంది ఉద్యోగులను తొలగించాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా 2023లో కంపెనీలు రోజుకు సగటున 1,600 మంది ఉద్యోగులను తొలగించాయి. ఇన్వెస్టర్లు సైతం కంపెనీ ఖరీదైన ఖర్చులను తగ్గించుకోవటానికి ఉద్యోగులను తొలగించాలని కోరుతున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications