Google: అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ తన వాలెట్ సేవలను భారతదేశంలో ప్రారంభించింది. గూగుల్ వాలెట్ పేరుతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజిటల్ యుగంలో ప్రజలకు ఇది అనేక ప్రయోజనాలను అదుబాటులోకి తీసుకొస్తోంది.
గూగుల్ ఇండియా ఈ రోజు డిజిటల్ వాలెట్‌ను నేడు ఆవిష్కరించింది. వాస్తవానికి గూగుల్ వాలెట్ సేవలు గూగుల్ పేకి పూర్తి భిన్నంగా ఉంటాయని కంపెనీ పేర్కొంది. గూగుల్ వాలెట్ వినియోగదారులు తమ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, గిఫ్ట్ కార్డులు మెుదలైన వాటిని డిజిటల్ రూపంలో స్టోర్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుందని కంపెనీ పేర్కొంది. పైగా ఇది పూర్తి సురక్షితమైనదిగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి గూగుల్ తన వాలెట్‌ను ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మాత్రమే భారతదేశంలో ప్రారంభించింది.

గూగుల్ వాలెట్లో వినియోగదారులు తమ కార్డులు, టిక్కెట్లు, పాస్‌లు, IDలను డిజిటల్ రూపంలో నిల్వ చేసుకోవచ్చు. వాస్తవానికి ఇది ఇండియాలో అందుబాటులో ఉన్న DigiLocker లాంటి సేవలను ప్రజలకు అందించనుంది. ఇక్కడ వినియోగదారులు ఆర్థికపరమైన డేటాను డిజిటల్‌గా నిల్వ చేయవచ్చు. ప్రజలు తమ సినిమా టిక్కెట్లు, ఈవెంట్ టిక్కెట్లు ఇందులో సేవ్ చేసుకోవచ్చు. ఇప్పటికే దేశంలో పెద్ద సంస్థలైన పీవీపీ, ఐనాక్స్ గూగుల్ వాలెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేసే వ్యక్తులకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది.
ఈ యాప్‌లో అనేక బోర్డింగ్ పాస్‌లకు యాక్సెస్ పొందుతారు. ట్రావెల్ రంగంలోని ఎయిర్ ఇండియా, మేక్ మై ట్రిప్, ఈజీ మై ట్రిప్, ఇండిగో తదితర సంస్థలు ఉన్నాయి. అలాగే వాలెట్లో వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్, డొమినోస్ గిఫ్ట్ ఓచర్లను సేవ్ చేసుకోవచ్చు. Google Wallet యాప్ ప్రజా రవాణాలో ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది. కొచ్చి మెట్రో, హైదరాబాద్ మెట్రో, అభి బస్ మొదలైన వాటికి టిక్కెట్లను సులభంగా కొనుగోలు, సేవ్ చేయవచ్చు.
డిజిటల్ రూపంలో వ్యక్తులు తమకు సంబంధించిన పత్రాలను గూగుల్ వాలెట్‌లో నిల్వ చేయవచ్చు. బోర్డింగ్ పాస్‌లు, లగేజీ ట్యాగ్‌లు, పార్కింగ్ రసీదులు, బార్‌కోడ్‌లు, QR కోడ్‌లు మొదలైనవి ఉన్నాయి. వీటికి తోడు రైలు టిక్కెట్లు, ఈవెంట్స్ సమాచారాన్ని ఈమెయిల్‌కి కూడా పంపవచ్చు.


Click it and Unblock the Notifications