గూగుల్ హబ్‌గా విశాఖ.. రూ. 8,730 కోట్ల పెట్టుబడితో 1GW సామర్థ్య గల మెగా డేటా సెంటర్ ఏర్పాటు..
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం భారత డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రముగా మారనుంది. అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,730 కోట్ల) పెట్టుబడితో విశాఖపట్నంలో 1GW సామర్థ్య గల మెగా డేటా సెంటర్ క్లస్టర్ స్థాపించనుంది. ఇది లైవ్ లోకి వస్తూ ఆసియాలో ఇప్పటివరకు ఏర్పాటైన అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌గా గుర్తింపు పొందనుంది.
ఈ ప్రాజెక్ట్ మూడు విభిన్న క్యాంపస్‌లలో విస్తరించబోతోంది: విశాఖపట్నం జిల్లాలోని అడవివరం, తర్లువాడ గ్రామాలు, పొరుగున ఉన్న అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి గ్రామంలో రానున్నాయి. పూర్తి స్థాయిలో ఈ సౌకర్యాలు జూలై 2028 నాటికి పనిచేయడం ప్రారంభించనున్నాయి.
గూగుల్ పెట్టుబడి కేవలం డేటా సెంటర్ల నిర్మాణం మాత్రమే కాదు. ఇది మూడు అధిక సామర్థ్యం గల జలాంతర్గామి కేబుల్స్, ప్రత్యేక కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు, విస్తృతమైన మెట్రో ఫైబర్ నెట్‌వర్క్‌లు, ఇతర ఆధునిక టెలికమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను కూడా కవర్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ డేటా మౌలిక సదుపాయాల కేంద్రంగా మార్చే అవకాశం కల్పిస్తుంది.

డిసెంబర్ 2024లో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుకు, Google టీం మధ్య అవగాహన ఒప్పందం సంతకం అయ్యింది. రాష్ట్రం, డేటా నగరాల అభివృద్ధిని సులభతరం చేయడానికి IT, కాపీరైట్ చట్టాల సవరణలను ముందుకు తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి ప్రమోషన్ బోర్డు ప్రాజెక్ట్‌ను ఆమోదించే అవకాశం ఉంది.
అయితే, కొంతకాలంగా చట్టపరమైన సమస్యలు ప్రాజెక్ట్ పురోగతిని నిరవధి నిలిపివేశాయి. గత పాలనలో కొంతమంది వ్యక్తులు ప్రాక్సీ దాఖలు చేసిన కోర్టు కేసులు, డీ-పట్టా రైతుల అభ్యంతరాలు వంటి అంశాలతో జాప్యాలకు కారణమయ్యాయి. ముఖ్యమంత్రి నాయుడు ఇటీవల వైజాగ్ పర్యటన సందర్భంగా సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అడ్డంకులు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రాజెక్ట్ ప్రగతిని ధృవీకరించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాజకీయ అడ్డంకులు ఉన్నప్పటికీ విశాఖపట్నం Google డేటా సెంటర్ క్లస్టర్ నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు.ఇది భారత్ IT మౌలిక సదుపాయాలలో ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి, 1GW సామర్థ్యం, ఆధునిక నెట్‌వర్క్‌ల నిర్మాణం, పలు క్యాంపస్‌ల విస్తరణతో విశాఖపట్నం ఆసియాలో అతిపెద్ద డేటా సెంటర్ హబ్‌గా గుర్తింపబడనుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ స్థానిక ఉద్యోగాలను పెంచి, ఆంధ్రప్రదేశ్‌ను ప్రాంతీయ IT, క్లౌడ్ కంప్యూటింగ్ కేంద్రంగా మార్చనుంది.


Click it and Unblock the Notifications