Pixel Phones: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలు ఒక్కొక్కటిగా భారత దేశానికి తమ ఉత్పత్తిని మారుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తన పిక్సెల్ స్మార్ట్ ఫోన్ల తయారీనికి కొంత మేర భారత్ కు తరలించే పనిలో గూగుల్ ఉంది.
భారత్ అందిస్తున్న ప్రోత్సాహకాలతో ఇప్పటికే ఐఫోన్ మేకర్ ఆపిల్ రికార్డు స్థాయిలో ఉత్పత్తిని కొనసాగిస్తోంది. తాజాగా ఇదే అవకాశాన్ని వినియోగించుకోవాలని గూగుల్ యత్నిస్తోంది. ఇందులో భాగంగా లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్, డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ సంస్థలతో ముందస్తు చర్చలు ప్రారంభించింది. వీటి ద్వారా తయారీని ఇండియాకు మార్చే టెక్ దిగ్గజం ఉంది.

చైనాలో కఠినమైన కోవిడ్ లాక్ డౌన్ నిబంధనలు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వంటి కారణాలతో అప్రమత్తమౌతున్న అనేక కంపెనీలు మోదీ సర్కార్ అందిస్తున్న అందిపుచ్చుకునేందుకు తమ తయారీని ఇండియాకు షిఫ్ట్ చేస్తున్నాయి. గతనెలలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కాలిఫోర్నియాలో గూగుల్ ప్రధాన కార్యాలయంలో సీఈవో సుందర్ పిచాయ్‌ని కలిసిన తర్వాత తాజా అభివృద్ధి వెలుగులోకి వచ్చింది.

ఈ క్రమంలో భాగస్వామ్య చర్చల కోసం గూగుల్ ఎగ్జిక్యూటివ్‌లలో దాని వినియోగదారు హార్డ్‌వేర్ విభాగం ఆపరేటింగ్ చీఫ్ అనా కొరల్స్, గ్లోబల్ సస్టైనింగ్ ప్రొడక్ట్ ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ మ్యాగీ వీ ఈ నెలలో ఇండియాను సందర్శించారు. గత ఏడాది 9 మిలియన్ల పిక్సెల్ స్మార్ట్ ఫోన్లను తయారు చేసిన గూగుల్ తన ఉత్పత్తిని చైనా, వియత్నాం నుంచి తరలించే ప్రణాళికతో ఉందని ప్రస్తుత పరిణామాల ప్రకారం తెలుస్తోంది. అత్యధిక జనాభాతో వృద్ధి అవకాశాలు మెండుగా ఉన్నందున కంపెనీ వాటిని ఆదాయంగా మలుచుకునే ప్రయత్నంలో ఉంది. స్థానిక అసెంబ్లీ పిక్సెల్ అమ్మకాలను పెంచడంలో సహాయపడుతుందని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications