Google News: ఎన్నికల జాతరకు సిద్ధమవుతున్న టెక్ దిగ్గజం.. నిబంధనల్లో పలు మార్పులు, ఆంక్షలు
Elections in India: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ లో ఎన్నికల హడావిడి ఏవిధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాల ఎన్నికల్లో ఇతర కంట్రీస్ కలుగజేసుకుంటున్నాయి అని అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. వీటికి తోడు ఫలితాలు తారుమారు చేసే అనైతిక పద్ధతులు కూడా ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వెత్తువెత్తుతున్నాయి. ఈసారి ఈ తరహా వార్తలను వాటిని కట్టడి చేసేందుకు ఏకంగా టెక్ దిగ్గజం గూగుల్ రంగంలోకి దిగింది.
త్వరలో ఇండియాలో జరగనున్న సాధారణ ఎన్నికలకు మద్ధతుగా గూగుల్ పలు చర్యలు ప్రకటించింది. ఓటర్లకు అత్యంత నాణ్యమైన సమాచారాన్ని అందజేసేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. తన ప్లాట్‌ఫారమ్స్‌ను దుర్వినియోగం నుంచి కాపాడేందుకు, AI ఆధారంగా యూజర్స్‌ను నావిగేట్ చేసేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపింది. ఎన్నికల సంఘానికి సహకరిస్తూ ఓటు ఎలా వేయాలి అనే కీలక సమాచారాన్ని ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో ఓటర్లకు అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పింది.

గూగుల్ ప్లాట్‌ఫారమ్స్‌లో ఎన్నికల ప్రకటనలకు సంబంధించి కూడా క్లియర్ నిబంధనలను రూపొందించింది. ప్రకటన కర్తలందరూ ధ్రువీకరణ ప్రక్రియతో పాటు ఎన్నికల కమిషన్ అనుమతి పత్రాన్ని సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. దీనికోసం నగదు చెల్లించిన వారి వివరాలు అందించడాన్ని తప్పనిసరి చేసింది. అదనంగా ఆయా అభ్యర్థులు ఎన్నికల్లో పాల్గొనకుండా చేసే అసత్య ప్రచారాలు, తప్పుడు క్లెయిమ్లను అడ్డుకునేందుకు నిర్దిష్ట విధానాన్ని కలిగి ఉన్నట్లు వివరించింది.
'మా విధానాలను ఉల్లంఘించే కంటెంట్ ను గుర్తించడానికి మానవ ప్రమేయంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సహాయం తీసుకోనున్నాం. ఫేక్ వార్తల ఆట కట్టించే మా పోరాట ప్రయత్నాలను AI మోడల్స్ మెరుగుపరుస్తాయి. అన్ని ప్రధాన భారతీయ భాషలలోనూ కంటెంట్ ను రివ్యూ చేయడానికి స్థానిక నిపుణుల ప్రత్యేక బృందం పనిచేస్తుంటుంది' అని గూగుల్ తెలిపింది.


Click it and Unblock the Notifications