గత నెలలో గూగుల్ జెమిని యాప్‌లో కొత్త AI ఇమేజ్ ఎడిటింగ్ టూల్ నానో బనానాని విడుదల చేసింది. ఇది విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ జెమిని యాప్‌ను 10 మిలియన్ మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. గూగుల్ VP జోష్ వుడ్‌వార్డ్ X (గతంలో Twitter)లో చెప్పినట్లుగా ఈ యాప్ వినియోగదారులను బాగా అట్రాక్ట్ చేస్తోంది. నానో బనానా AI మోడల్‌ను ఉపయోగించి మీరు ఫోటోలు సృష్టించడానికి లేదా మార్చడానికి ఇంకా ప్రత్యేక ఎఫెక్ట్స్ పెట్టడానికి చాలా త్వరగా, సులభంగా చేయొచ్చు.
గూగుల్ తెలిపినట్టుగా ఇప్పటివరకు 200 మిలియన్లకి పైగా చిత్రాలు నానో బనానా ద్వారా వినియోగదారులు సృష్టించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది చాట్‌జిపిటి, మిడ్‌జర్నీ వంటి ఇతర AI టూల్స్ కంటే వేగవంతంగా ఖచ్చితంగా పనిచేస్తుంది.ఇది ప్రత్యేకంగా 3D బొమ్మలను సృష్టించడానికి, అందమైన ఇమేజ్‌లను మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఈ టూల్ 200 మిలియన్లకు పైగా ఫోటోలను సృష్టించింది.ఏఐ టూల్ ద్వారా సినీతారలు, రాజకీయ నాయకులు, పెంపుడు జంతువులు లాంటి విభిన్న విభాగాల్లోని వ్యక్తులు తమ చిత్రాలను సృజనాత్మకంగా రూపొందిస్తున్నారు. ప్రతి ఫోటో చూస్తే ప్రేక్షకులు ఒకరకంగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

నానో బనానా ట్రెండ్ అంటే ఏమిటి: నానో బనానా ట్రెండ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇది ఒక అద్భుతమైన AI ఇమేజ్ ఎడిటింగ్ టూల్. వాడడం చాలా సులభం. ఆకర్షణీయమైన ఫలితాలు ఇస్తుంది. ఎటువంటి ఖర్చు ఉండదు. కేవలం మీ ఫోటోను అప్‌లోడ్ చేసి, కొన్ని మాటల ప్రాంప్ట్ ఇచ్చితే చాలు. సెకన్లలోనే ప్రొఫెషనల్ స్థాయి 3D బొమ్మలు, క్లాసిక్ ఆర్ట్ స్టైల్ చిత్రాలు, ఫ్యూచరిస్టిక్ ల్యాండ్‌మార్క్‌లు సృష్టించవచ్చు. ఇది వినియోగదారులకు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంది.ఎటువంటి టెక్నికల్ నైపుణ్యాలు అవసరం లేదు. తక్షణమే ఫలితాలను పంచుకోవచ్చు.
ప్రస్తుతం Nano Banana లో 5 ప్రత్యేక ప్రాంప్ట్‌లు అందుబాటులో ఉన్నాయి, ఇవి వినియోగదారులకు తాము కోరిన విధంగా చిత్రాలను సృష్టించడంలో సహాయపడుతున్నాయి. ఈ ప్రాంప్ట్‌లు ద్వారా మీరు సులభంగా 3D మోడల్స్, క్లాసిక్ చిత్రాలు సీరియస్ టీవీ షో సన్నివేశాలకు, ఫ్యూచరిస్టిక్ ల్యాండ్‌మార్క్‌లకో మీ స్వంత డిజైన్‌ను తయారు చేయవచ్చు.
1. మీరు యాక్షన్ ఫిగర్‌గా మారండి: మీ ఫోటోను అప్‌లోడ్ చేసి నన్ను సేకరించదగిన బొమ్మలా మారుస్తూ, బొమ్మల పెట్టెలో స్పష్టమైన ప్లాస్టిక్ విండో, గ్రాఫిక్స్, నా పేరు తో కూడిన ప్యాకేజింగ్ చేయండి అని అడగండి. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వైరల్ అయింది.మీరు యాక్షన్ ఫిగర్‌గా మార్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
2. మిమ్మల్ని మీరు గత దశాబ్దంలో ఊహించండి: మీరు 1920, 1970ల లేదా 1990లలో ఎలా కనిపిస్తారో ఊహించండి. ఉదాహరణకు.. నన్ను 1980ల ఫ్యాషన్‌లోకి మార్చండి. నియాన్ దుస్తులు, పెద్ద జుట్టు, ఆర్కేడ్ నేపథ్యం లో నన్ను మార్చండని ఏఐని అడగండి. ఈ ట్రెండ్ వినియోగదారులను చాలా ఆకట్టుకుంటోంది.
3. ప్రసిద్ధ టీవీ షోలో కనిపించండి: మీరు ఫేమస్ షోలలో భాగమవ్వాలని అనుకుంటే..సీన్‌ఫెల్డ్ షోలో జెర్రీ అపార్ట్‌మెంట్‌లో నేను ఎలైన్, జార్జ్, క్రామెర్‌తో కూర్చొని నవ్వుతున్నట్టు చూపించు అని అడగండి. నానో బనానా వెంటనే మీ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది.
4. క్లాసిక్ ఆర్ట్‌వర్క్‌లో భాగమవ్వండి: మీరు మోనాలిసా, విన్‌సెంట్ వాన్ గోగ్ యొక్క 'స్టార్రీ నైట్' లేదా డాలీ యొక్క 'ది పెర్సిస్టెన్స్ ఆఫ్ మెమరీ' చిత్రాలలో కనిపించాలి అనుకుంటే.. నన్ను స్టార్రీ నైట్‌లో వేసి, వాన గోగ్ స్టైల్ బ్రష్‌స్ట్రోక్‌లతో పెయింట్ చేయండి అని అడగండి. వెంటనే మీ ఇమేజ్ వస్తుంది.
5. ప్రపంచ ల్యాండ్‌మార్క్‌లలో సెల్ఫీ: మీరు ఐఫెల్ టవర్, తాజ్ మహల్, హాలీవుడ్ సైన్ వంటి ప్రఖ్యాత ల్యాండ్‌మార్క్‌లతో ఫోటో రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు,,నా ఫోటోని హాలీవుడ్ సైన్ పైన చూపించి, నగరం వైపు చేయి ఊపుతూ ఉంచండి. నిజమైన లైటింగ్ మరియు నీడలు ఉండేలా చేయండి అని మీరు అడిగితే వెంటనే నానో బనానా మీకు ఫోటో అలానే అందిస్తుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications