ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచం ఎంత వేగంగా మారుతుందో చెప్పడానికి గూగుల్ తీసుకువచ్చిన తాజా మార్పులే నిదర్శనం. ఇప్పటివరకు మన సందేహాలకు మాత్రమే సమాధానాలు చెప్పిన ఏఐ టూల్స్ ఇకపై మనకు షాపింగ్ చేసిపెట్టే ఏజెంట్స్ లా మారబోతున్నాయి. గూగుల్ జెమినీ ఏఐ (Gemini AI).. ఇకపై మనం కోరుకున్న వస్తువులను వెతికి పెట్టి అక్కడికక్కడే కొనుగోలు చేసేలా (Instant Checkout) కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. గూగుల్ తన జెమిని యాప్‌ను కేవలం అసిస్టెంట్‌గా మాత్రమే కాకుండా ఒక 'వర్చువల్ మర్చంట్'గా మారుస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పెద్ద కంపెనీలతో జతకట్టిన గూగుల్
ఈ సరికొత్త షాపింగ్ అనుభవాన్ని అందించడానికి గూగుల్ ప్రపంచ ప్రసిద్ధ రిటైల్ సంస్థలైన వాల్‌మార్ట్ (Walmart), షాపిఫై (Shopify), వేఫెయిర్ (Wayfair) వంటి కంపెనీలతో చేతులు కలిపింది. దీనివల్ల వినియోగదారులు జెమిని చాట్ బాక్స్ నుండి బయటకు రాకుండానే తమకు నచ్చిన వస్తువులను ఆర్డర్ చేసుకునేలా ఫీచర్ తీసుకురాబోతోంది. ఉదాహరణకు, మీరు "ట్రిప్ కోసం బెస్ట్ వింటర్ జాకెట్ ఏది?" అని అడిగితే జెమిని వివిధ స్టోర్ల నుండి వస్తువులను చూపిస్తుంది. మీరు వాటిలో నచ్చినది సెలక్ట్ చేసుకుని అక్కడికక్కడే పేమెంట్ చేసి కొనుగోలు చేయవచ్చు. అంటే ఇక మీకు ఇతర షాపింగ్ యాప్స్ తో అవసరం లేదన్న మాట.
ఏజెంట్-లెడ్ కామర్స్: రిటైల్ రంగంలో కొత్త మార్పు
వాల్‌మార్ట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంయుక్తంగా ఈ విషయాన్ని ప్రకటించారు. "సాధారణ సెర్చ్ నుండి ఏజెంట్ నేతృత్వంలోని వాణిజ్యానికి (Agent-led commerce) మారడం అనేది రిటైల్ రంగంలో ఒక గొప్ప పరిణామం" అని వాల్‌మార్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. సేల్స్‌ఫోర్స్ నివేదిక ప్రకారం గత హాలిడే సీజన్ లో జరిగిన గ్లోబల్ రిటైల్ అమ్మకాల్లో సుమారు 20% (సుమారు 272 బిలియన్ డాలర్లు) ఏఐ ప్రభావంతోనే జరిగాయి. అంటే చాలామంది షాపింగ్ చేయడానికి ఏఐ సాయం తీసుకుంటున్నారు. దీన్ని బట్టి ఏఐ ప్రభావం షాపింగ్ రంగంలో ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
డ్రోన్ డెలివరీ, ఫ్యూచర్ ప్లాన్స్
కేవలం ఆన్‌లైన్ షాపింగ్ మాత్రమే కాదు.. కొన్న వస్తువులను వేగంగా డెలివరీ చేయడానికి కూడా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్, వాల్‌మార్ట్ కృషి చేస్తున్నాయి. అదనంగా 150 వాల్‌మార్ట్ స్టోర్లలో డ్రోన్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 2027 నాటికి ఈ సంఖ్యను 270కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం జెమినీ ఏఐ (Gemini AI) ద్వారా షాపింగ్ చేసే ఫీచర్ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ, త్వరలోనే ఇది అంతర్జాతీయంగా విస్తరించనుంది.
ఓపెన్ ఏఐ (ChatGPT), గూగుల్ మధ్య జరుగుతున్న ఈ పోటీ వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని తెస్తోంది. షాపింగ్ కోసం గంటల తరబడి వెతకాల్సిన పనిలేకుండా, ఒక స్నేహితుడితో మాట్లాడినట్లు జెమినీ ఏఐ (Gemini AI) తో చాట్ చేస్తూ మనకు నచ్చినవి కొనుగోలు చేసే రోజులు వచ్చేశాయి. మొత్తంగా ఏఐ వల్ల రోజువారీ జీవితం మరింత సౌకర్యవంతంగా మారుతోంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications