భారత దేశంలో వందలాది భాషలు ఉన్నాయి. అలాగే, దాదాపు ప్రతి 100 కిలో మీటర్లకు మాండలికం మారే దేశం ఇది. ఆంగ్ల ప్రాబల్యం కలిగిన ఈ ప్రపంచంలో స్థానిక భాషలు, మాండలికాలకు ఇంటర్నెట్‌లో సరైన ప్రాముఖ్యత లభించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గూగుల్ భారతీయ భాషల్లో మరింత సమాచారం, సామర్థ్యాన్ని జోడిస్తోంది. ఈ మేరకు గూగుల్ ఇండియా కంట్రీహెడ్, ఉపాధ్యక్షులు సంజయ్ గుప్తా తెలిపారు. ఆయన గూగుల్ L10n వర్చువల్ సదస్సులో ప్రసంగించారు.

తెలుగు సహా 9 భాషల్లో..
ప్రపంచంలోని విభిన్న భాషలు కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. దేశంలో 22 భాషలు అధికారిక భాషలుగా గుర్తింపు పొందాయి. గూగుల్ ఇప్పుడు తన ఉత్పత్తులను, సేవలను ఒక బిలియన్ భారతీయుల కోసం స్థానికంగా అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గూగుల్ L10n సదస్సులో స్టార్టర్స్, వ్యాపారుల కోసం దేశంలోని గుజరాతీ, మరాఠీ, తమిళం, తెలుగుతో పాటు 9 స్థానిక భాషలలో గూగుల్ మ్యాప్స్ అందుబాటులో ఉంటుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను కూడా ఈ భాషల్లో అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేనివిధంగా ప్రతి నెలలో భారత్‌లో అత్యధిక మంది గూగుల్ లెన్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మెరుగైన సేవలు అందించేందుకు భారతీయుల కోసం గూగుల్ లెన్స్‌ను సెర్చ్‌లో జోడించినట్లు తెలిపింది.

అదనపు సామర్థ్యాల జోడింపు
తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లో ప్రజలు సులభంగా సమాచారం తెలుసుకోవడానికి, గూగుల్ మ్యాప్స్‌ను మరిన్ని భారతీయ భాషల్లో పొందేందుకు వీలుగా అదనపు సామర్థ్యాలను జోడించినట్లు గూగుల్ తెలిపింది. ఇంగ్లీష్ నుండి సమాచారాన్ని తెలుగు, తమిళం, బెంగాళీ, మరాఠీ భాషల్లో మార్చుకునే సౌలభ్యం కల్పించింది. ఇంటర్నెట్ పైన స్థానిక భారతీయ భాషల్లో సమాచార సృష్టి, వినియోగం, ఇతర సవాళ్లను ఎదుర్కొనేందుకు గూగుల్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ఫీచర్స్ అందించినట్లు సంజయ్ వివరించారు.

ప్రాంతీయ భాషను వినియోగిస్తున్నారు
దేశంలో పది కోట్ల మంది ఆన్‌లైన్ వినియోగదారులు ఉన్నారని, కొన్నేళ్లలో ప్రాంతీయ భాషల్లో మరిన్ని ఉత్పత్తులు తీసుకువచ్చామని సంజయ్ అన్నారు. మెట్రో నగరాల వెలుపల ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిందని, పది కోట్ల మందికి పైగా కొత్త ఇంటర్నెట్ వినియోగదారులు గ్రామీణ ప్రాంతాల నుండి జత కలిశారని తెలిపారు. ఆన్‌లైన్‌కు వస్తున్న కొత్త వినియోగదారుల్లో ఎక్కువ మంది ప్రాంతీయ భాషను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications