బెంగుళూరులో నివాసం ఉండాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. లక్ష జీతం వచ్చినా కూడా బెంగుళూరులో నివాసం ఉండాలంటే చాలామంది భయంతో వణికిపోతుంటారు. ఇక ఫ్యామిలీని పెట్టారంటే వారి పని అయిపోయినట్లే.. వచ్చే జీతం మొత్తం ఫ్యామిలీకే సరిపోతుంది.. సాఫ్ట్ వేర్లు కూడా చాలామంది ఫ్యామిలీని పెట్టేందుకు ఖర్చు భయంతో పీజీల్లో ఉంటుంటారు. తాజాగా బెంగళూరులో నివసిస్తున్న గూగుల్ ఉద్యోగి ప్రియాంశ్ అగర్వాల్ బెంగుళూరు కాస్ట్ ఆఫ్ లివింగ్ పై చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ పోస్టులో అతను అద్దె ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ..2BHK ఇంటిని ఒంటరిగా అద్దెకు తీసుకున్నాడు. అందులో ఒక గదిని పూర్తి స్థాయిలో వర్క్ ఫ్రం హోమ్ స్పేస్‌గా మలచుకోవడం ద్వారా తన జీవితంలో వచ్చిన మార్పుల్ని అతను పోస్ట్ ద్వారా వెల్లడించాడు. ఆ ఉద్యోగి మాట్లాడుతూ.. ఈ ఏడాది నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం ఏంటంటే.. ఒంటరిగా 2BHK ఫ్లాట్ లోకి మారడం. అందులో ఒక గదిని వర్క్ స్పేస్‌కి కేటాయించడమని తెలిపారు.

నా జీతంలో చాలా భాగం అద్దె రూపంలో ఖర్చు అవుతున్నా. నాకు ఎంతో మనశ్శాంతి, ప్రశాంతత లభిస్తోంది. ఇక్కడకు వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమవుతోంది ఎందుకు చాలామంది ఒంటరిగా నివసించడానికి ఇష్టపడతారో అంటూ అతను X లో రాసుకొచ్చాడు. అయితే బెంగళూరులో ఎక్కువ మంది ఉద్యోగులు ఖర్చును ఆదా చేసుకోవడానికి ఫ్లాట్ షేరింగ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఉద్యోగి మాత్రం రూంలో ఒంటరిగా ఉండటమే మెరుగైన మానసిక ఆరోగ్యానికి దారితీస్తుందని చెబుతున్నారు.
ఈ పోస్ట్‌పై అనేక మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. వారిలో చాలామంది ఉద్యోగులు కూడా ఇలాగే ఒంటరిగా ఉండటం వల్ల లభించే ప్రశాంతత, టెన్సన్ రిలీప్ గురించి పంచుకున్నారు. మరికొంత మంది నెటిజన్లు అయితే నీకు నీవు అనుభవించడం జీవిత ప్రమాణాన్ని పెంచుతుంది. దాని కోసం ఖర్చు పెట్టడం తప్పు కాదంటూ కామెంట్లు చేశారు. ఇంకొకరు "ఒంటరిగా ఉండటం అలవాటైపోతే మళ్లీ ఇతరులతో కలిసి ఉండే రూమ్‌కి వెళ్లే ఆలోచనే చేయలేమని తెలిపారు.
ఈ పోస్ట్ చాలా సున్నితమైన మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది. ఇప్పటి పట్టణ వాసులకూ, ఉద్యోగులకు శాంతి, ప్రశాంతత అనే వాటి కోసం ఖర్చు ఎంత చేయడానికైనా రెడీ అనేలా కనిపిస్తోంది. అద్దె ఖర్చు ఎక్కువైనా ఒంటరిగా జీవిచండానికి 'లగ్జరీ'గా కాకుండా నచ్చినట్లుగా జీవించడానికి ఇప్పుడు అందరూ ఆలోచన చేసే సమయం వచ్చిందని నెటిజన్లు చెబుతున్నారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Bengaluru: యాపిల్ కంపెనీలో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. కానీ ఈ టెక్కీ ఆటో ఎందుకు నడుపుతున్నాడో తెలుసా?

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

ఒకప్పుడు మ్యాగీ తింటూ గడిపాడు! నేడు నెలకు రూ. 3.5 లక్షల సంపాదిస్తున్నాడు!

Bengaluru: బెంగళూరులో రూ. 500తో రోజంతా గడపడం సాధ్యమేనా? ఈ యువతి ఏం చేసిందో చూడండి!

Vande Bharat: బెంగళూరు టూ ముంబై వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది! రూట్ మ్యాప్ ఇదే!

Layoffs: లేఆఫ్స్ వల్ల పనితీరు ఎందుకు పడిపోతుంది? సైన్స్ చెబుతున్న నిజాలివే..

Bengaluru: రోడ్లు చూస్తే గుంతలు.. బడ్జెట్ చూస్తే వేల కోట్లు! అసలు డబ్బు అంతా ఎటు వెళ్తోంది?

Bengaluru: ఇన్వెస్టర్లకు పండగే: బెంగళూరులోని ఈ ప్రాంతాల్లో ఆస్తుల విలువ భారీగా జంప్!

Bengaluru: బిజినెస్ చేయాలని ఉన్నా ధైర్యం సరిపోవట్లేదా? మీరు కూడా ఈ ట్రాప్‌లో ఉన్నారేమో చూసుకోండి!



Click it and Unblock the Notifications