గూగుల్ ఉద్యోగికే తప్పని అద్దె షాక్..ట్రాఫిక్ అయినా భరిస్తా కానీ ఆ రెంట్ కట్టలేను బాబోయ్!
మన దేశపు సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు (Bengaluru) లో ఐటీ ఉద్యోగం సంపాదించడం, అక్కడ సొంతంగా బతకడం ఒక కల అని చాలామంది అనుకుంటారు. అక్కడ పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు లక్షల్లో జీతాలు ఉంటాయి కాబట్టి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని బయట ప్రపంచం ఊహిస్తుంది. కానీ, తాజాగా ఒక గూగుల్ (Google) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఎదురైన రెంట్ షాక్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఒక పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. బెంగళూరులో ఆకాశాన్ని తాకుతున్న ఇళ్ల అద్దెలు, అంతకంటే దారుణంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలపై ఈ సంఘటన సరికొత్త చర్చకు దారితీసింది.

అసలు ఏం జరిగిందంటే?
బెంగళూరులోని గూగుల్ ఆఫీస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దివ్య పోర్వాల్ అనే యువతి, తన ఆఫీస్‌కు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటోంది. ఈ దూరం ప్రయాణించడానికి ఆమెకు ప్రతిరోజూ ట్రాఫిక్ వల్ల ఏకంగా 2 గంటల సమయం పడుతుందట. ఈ రోజువారీ నరకం నుండి తప్పించుకోవడానికి, ఆఫీస్ పక్కనే ఇల్లు రెంట్‌కు తీసుకుంటే టైమ్ కలిసి వస్తుందని భావించి ఆమె ఇళ్ల వేట మొదలుపెట్టింది.
1BHK రెంట్ ₹40,000 ఆ? మైండ్ బ్లాక్!
ఆఫీస్ పరిసరాల్లో, ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలలో ఇళ్లను పరిశీలించిన దివ్యకు అక్కడ అద్దెలు చూసి ఫ్యూజులు ఎగిరిపోయాయి. కేవలం ఒకే ఒక్క బెడ్‌రూమ్ ఉన్న చిన్న ఫ్లాట్ (1BHK) రెంట్ నెలకు ₹30,000 నుండి ₹40,000 వరకు చెప్తున్నారట. గూగుల్ కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉండి, భారీ జీతం తీసుకుంటున్నప్పటికీ, ఒక చిన్న సింగిల్ బెడ్‌రూమ్ ఇంటికి అంత అద్దె కట్టడం వేస్ట్ అని ఆమె భావించింది.
దీనితో ఆమె ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. నెలకు ₹40,000 అద్దె కట్టి జేబు ఖాళీ చేసుకోవడం కంటే, రోజుకు 2 గంటల పాటు ట్రాఫిక్‌లో ప్రయాణించడమే బెటర్ అని ఫిక్స్ అయిపోయింది. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' (ట్విట్టర్) లో పోస్ట్ చేయడంతో అది కాస్తా విపరీతంగా వైరల్ అయ్యింది.
సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య యుద్ధం!
ఈ పోస్ట్‌పై బెంగళూరు (Bengaluru) లో ఉంటున్న ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
- చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ దివ్య నిర్ణయాన్ని సమర్థిస్తూ, "మేము కూడా ఇలాంటి అద్దెల మంటను అనుభవిస్తున్నాము. ఐటీ కారిడార్స్ (ORR, మాన్యతా టెక్ పార్క్) పరిసరాల్లో ఇళ్ల ధరలను కావాలనే పెంచేస్తున్నారు" అని కామెంట్స్ చేస్తున్నారు.
- "కొన్ని పరిశ్రమలలో జీతాలు పెరగకపోయినా, ఈ ఇళ్ల అద్దెలు మాత్రం ఐటీ జీతాలను చూసి డబుల్ అవుతున్నాయి" అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.
- అయితే, కొందరు నెటిజన్లు భిన్నంగా స్పందించారు. "ఉద్యోగులు ఎప్పుడూ తమ 'కంఫర్ట్ జోన్' లేదా కేవలం ఐటీ ఏరియాల్లోనే ఇళ్ల కోసం వెతుకుతారు, అందుకే అక్కడ డిమాండ్ పెరిగి రేట్లు అలా ఉన్నాయి. కొంచెం పక్కకు వెళ్లి వెతికితే తక్కువ ధరకే ఇళ్లు దొరుకుతాయి" అని సలహాలు ఇస్తున్నారు.
బెంగళూరు నగరంలో దాదాపు 1.2 కోట్ల జనాభా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు, వర్షం వస్తే రోడ్లు మునిగిపోవడం, గుంతల రోడ్లు.. వీటన్నింటికీ తోడు ఈ అద్దెల భారం ఐటీ ఉద్యోగుల జీవితాలను ఎంత ఇబ్బంది పెడుతున్నాయో ఈ వైరల్ పోస్ట్ నిరూపించింది.


Click it and Unblock the Notifications