google: గూగుల్ ఉద్యోగులు రోజుకు 90 నిమిషాలే పనిచేయడం నిజమేనా..? ఇవిగో పూర్తి వివరాలు..

google: ఉద్యోగుల పనిగంటలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలు ఇందుకు ఆజ్యం పోశాయి. అయితే అంతకు ముందే గూగుల్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తమ కంపెనీలో వర్క్ కల్చర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే అవన్నీ నిజం కాదని ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

గూగుల్ లో పనిగంటల గురించి ఈ ఏడాది ప్రారంభంలో ఓ ఉద్యోగి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము రోజుకు కేవలం 90 నిమిషాలు మాత్రమే పనిచేస్తామని తెలిపారు. అయినప్పటికీ భారీ వేతనాన్ని పొందుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే గూగుల్ ఎంప్లాయీస్ కూడా ఇతర కంపెనీల్లో ఉద్యోగులు మాదిరిగానే పనిచేస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.

Google employees working 90 minutes per day is wrong. Here are the details..

ఆ నివేదిక ప్రకారం.. గూగుల్ ఉద్యోగులు రోజుకు కనీసం 8 గంటలపాటు పనిచేస్తారని కంపెనీ అంతర్గత మెమో వెల్లడించింది. ఫ్లెక్లిబుల్ వర్కింగ్ కోసం ఓ గూగ్లర్ అభ్యర్థిచడంపై HR ప్రతినిధి ఈ మెమో రిలీజ్ చేశారు. అవసరమైన సమయాల్లో, బిజీ పీరియడ్స్ లో ఉద్యోగులు 8 గంటల కంటే ఎక్కవసేపు పనిచేస్తున్నట్లు అందులో వివరించారు.

'ఇతర కంపెనీల మాదిరిగానే మా ఉద్యోగులు కూడా టార్గెట్ చేరుకోవడానికి, సహచరుల పనిని కవర్ చేయడానికి ఎక్కువ సమయం పనిచేస్తారు. మా వినియోగదారులకు ఉత్పత్తులు మరియు సేవలను అందించడం అత్యవసరమైన సందర్భంలో.. వారానికి 40 గంటల కంటే అధికంగా పని చేసే సందర్భాలూ ఉన్నాయి' అని గూగుల్ ప్రతినిధి కోర్టేనే మెన్సిని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+