Google Layoffs: గూగుల్ తొలగింపులపై గళం విప్పిన ఉద్యోగులు.. షాకింగ్ నిర్ణయం..
Layoff News: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగుల తొలగింపుల విషయంలో ఏమాత్రం తగ్గటం లేదు. పైదా ఈ తొలగింపులు రానున్న కాలంలో సైతం కొనసాగుతాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల ఉద్యోగులకు మెయిల్ ద్వారా స్పష్టం చేశారు.
కంపెనీ పాటిస్తున్న పద్ధితిని గూగుల్ ఉద్యోగులకు మింగుడుపడటం లేదు. అసంతృప్తిలో ఉన్న టెక్కీలు కంపెనీ ఇటీవల చేపట్టిన తొలగింపులకు వ్యతిరేకంగా నిరసనలను ప్లాన్ చేశారు. కంపెనీ తీసుకున్న నిర్ణయం కారణంగా దాదాపు 15,000 మంది ప్రభావితం అయ్యారు. ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ జనవరి 18న యునైటెడ్ స్టేట్స్‌లోని ఐదు గూగుల్ క్యాంపస్‌లలో ప్రదర్శనలను నిర్వహించింది.

టెక్ దిగ్గజం తన యాడ్స్ సహా వివిధ విభాగాల్లో 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడైన నేపథ్యంలో అశాంతి నెలకొంది. అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్టీఫెన్ మెక్‌ముర్ట్రీ, తొలగింపుల తరువాత జరిగిన పరిణామాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అకస్మాత్తు తొలగింపుల గురించి ఉద్యోగులు ఆందోళనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ సైతం ఏఐ టూల్స్ వినియోగాన్ని పెంచటం ద్వారా వివిధ విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యలను తగ్గించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
ఈ క్రమంలో కంపెనీ లోపల, వెలుపల కొత్త పాత్రలను పొందడంలో బాధిత ఉద్యోగులకు సహాయం చేయడానికి గూగుల్ తన నిబద్ధతను కూడా నొక్కి చెప్పింది. ఇదే క్రమంలో కంపెనీలో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తనను కంపెనీ అన్యాయంగా తొలగించిందని పేర్కొన్నాడు. కంపెనీలో దాదాపు 6 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నానని.. గూగుల్ ఉద్యోగుల తొలగింపు విషయంలో సరైన పద్దతి పాటించకుండా ర్యాండమ్‌గా కంపెనీ నుంచి తొలగింపులు చేపడుతోందని అన్నారు.


Click it and Unblock the Notifications