గూగుల్ కూడా AI బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా, కొంతమంది ఉద్యోగులను తగ్గించడం మొదలుపెట్టింది. ఇది ఖర్చులు తగ్గించుకోవడానికి మరియు AI లో పెట్టుబడులను పెంచుకోవడానికి ఒక భాగం.
CNBC కు లభించిన అంతర్గత డాక్యుమెంట్స్ ప్రకారం, ఈ ఉద్యోగాలు యూజర్ల అనుభవాన్ని డేటా ఆధారంగా అర్థం చేసుకోవడంలో మరియు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ వాడినప్పుడు, అందించే సేవలపై యూజర్లు ఎలా స్పందిస్తారో పరిశీలించే విభాగాలను ప్రభావితం చేశాయి. ఈ టీమ్స్ డేటా, సర్వేలు, డిజైన్ రీసర్చ్ ద్వారా యూజర్ ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో కీలకంగా ఉంటాయి. ఇవన్నీ అభివృద్ధికి ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాల్లో, గూగుల్ క్లౌడ్ డిజైన్ టీమ్స్‌ను సగం తగ్గించిందని, ప్రధానంగా U.S లో పనిచేసే ఉద్యోగులు ఎక్కువ ప్రభావితం అయ్యారని తెలుస్తోంది. ఈ ఉద్యోగులకు డిసెంబర్ ప్రారంభం వరకు మరో ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

గూగుల్ ఈ ఉద్యోగాల తగ్గింపు AI పై వేగంగా దృష్టి పెట్టడంలో భాగంగా చేసిందని చెప్పారు. 2025 ప్రారంభం నుండి US యూనిట్లలో స్వచ్ఛంద రిటైర్ ప్యాకేజీలు అందించడం, చిన్న టీమ్‌లను నడిపే మేనేజర్లను తొలగించడం, ఉద్యోగులను రోజువారీ వర్క్‌లో AI మరింతగా ఉపయోగించమని ప్రోత్సహించడం జరుగుతోంది. ఈ తగ్గింపులు HR, హార్డ్‌వేర్, ప్రకటనలు, సెర్చ్, ఫైనాన్స్, కామర్స్ వంటి విభాగాల వరకు విస్తరించాయి.
CEO సుందర్ పిచాయ్ ఉద్యోగులకు 'కంపెనీ పెరుగుతున్న కొద్దీ, మన పని విధానం మరింత సమర్థవంతంగా ఉండాలి.' దీని అర్థం, ఉద్యోగాల తగ్గింపులు తాత్కాలికం కాదు దీర్ఘకాలిక మార్పుకు భాగం. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి టెక్ కంపెనీలు AI లో భారీ పెట్టుబడులు పెడుతూ ప్రత్యర్థులతో ముందుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాయి అని చెప్పారు. గూగుల్ మాత్రమే కాదు, ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ జూలైలో 9,000 ఉద్యోగాలను తొలగించింది. మెటా 2023 నుండి అనేక రౌండ్లలో తొలగింపులు చేసింది.
గూగుల్‌లో జరిగే ఉద్యోగాల తగ్గింపుల వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగులు తమ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి కొన్ని అవకాశాలను పొందుతున్నారు. కంపెనీ ప్రభావితమైన ఉద్యోగుల కోసం అంతర్గత ఉద్యోగ మార్పు అవకాశాన్ని డిసెంబర్ వరకు ఇస్తోంది, అంటే వారు కంపెనీలోనే మరొక తగిన రోల్‌లో చేరే ప్రయత్నం చేయవచ్చు. అదనంగా స్వచ్ఛంద రిటైర్మెంట్ ప్యాకేజీ లేదా రీటైర్మెంట్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా ఉద్యోగులు ఆర్ధిక భద్రతతో బయటకు రావచ్చు.
ఇక సామాజిక పరంగా చూస్తే, ఈ ఉద్యోగులు ఇప్పుడు కొత్త టెక్నాలజీలు, AI tools, క్లౌడ్ సేవలు వంటి స్కిల్స్ నేర్చుకునే అవకాశం పొందుతారు. ఇది వారి కెరీర్ అభివృద్ధికి మద్దతుగా ఉంటుంది. కొన్ని ఉద్యోగులు AI, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో కొత్త అవకాశాలను కూడా పొందగలరు. అందువల్ల ఈ ఉద్యోగాల తగ్గింపులు ప్రతి ప్రభావిత ఉద్యోగి జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త ఎదుగుదలకథలుగా మారే అవకాశం కల్పిస్తాయి.
More From GoodReturns

నోకియా నుంచి 14 వేల మంది రోడ్డు మీదకు.. టెలికాం రంగంలో ప్రకంపనలు రేపుతున్న తాజా లేఆప్స్..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications