Google Salaries: కష్టపడి సంపాదించి ఎదగడం పాత పద్ధతి. ఇప్పుడంతా స్మార్ట్ వర్క్ ద్వారా ఎదిగే వాళ్లే ఎక్కువ. ఇదంతా టెక్నాలజీ వల్లే సాధ్యమవుతోంది. రోజుకి 12 గంటలు కష్టపడినా నెలకు 10 వేల కూడా సంపాదించలేని పరిస్థితుల్లో కొందరు ఉంటే.. ఓ వ్యక్తి మాత్రం కేవలం గంట మాత్రమే శ్రమిస్తూ ఏడాదికి కోటికి పైగా జీతం తీసుకుంటున్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి, ఆయన చేసే పనేంటో తెలుసుకుందాం..
ఓ వ్యక్తి రోజుకి గంట మాత్రమే పని చేస్తాడు కానీ సంపాదన మాత్రం మామూలుగా ఉండదు. ఏకంగా ఏడాదికి 1.2 కోట్లు. సుమారు 20 ఏళ్లకు పైబడి వయసున్న డెవాన్.. తన సంవత్సర ప్యాకేజ్ సుమారు లక్షా 50 వేల డాలర్లని చెప్పినట్లు ఫార్చూన్ నివేదిక వెల్లడించింది. తను కేవలం రోజుకి గంట మాత్రమే పనిచేస్తున్నట్లు తెలిపింది. దీనికి అదనంగా సైన్ ఇన్ బోనస్ అందుకోగా.. సంవత్సరాంత బోనస్ కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది.

గూగుల్ కు సంబంధించిన టూల్స్ సహా ఇతర ఉత్పత్తులకు డెవాన్ కోడ్ రాస్తుంటాడని నివేదిక తెలిపింది. ఒకవేళ సాధారణ వేళల్లో పని చేయడానికి కుదరని పరిస్థితుల్లో.. ఎంచక్కా రాత్రి సమయంలో తన పని పూర్తి చేసుకుంటాడని వెల్లడించింది. గతంలో అతడు టెక్ దిగ్గజం గూగుల్ లో ఇంటర్న్ గా పని చేశాడట. అప్పుడు కూడా తన పని అంతటినీ త్వరగా పూర్తి చేసుకుని హవాయికి లాంగ్ ట్రిప్ కి వెళ్ళినట్లు గుర్తు చేసుకున్నాడని చెప్పింది.
'రోజంతా పనిచేయాలని అనుకుంటే స్టార్ట్ అప్స్ లోనే వర్క్ చేసే వాడిని. గూగుల్ అందిస్తున్న వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సహా ఇతర బెనిఫిట్స్ వల్ల ఎక్కువమంది కంపెనీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఆపిల్ ఉద్యోగులు సైతం గంటలు తరబడి పని చేస్తారు కానీ గూగుల్ లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది' అని డెవాన్ తెలిపినట్లు ఫార్చూన్ నివేదిక వెల్లడించింది.


Click it and Unblock the Notifications