ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు అందులో పనిచేసే ఉద్యోగులు షాక్ ఇచ్చారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో కార్యాలయం ఎదుట శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో దాదాపు 200 మంది ఉద్యోగులు ఆందోళకు దిగారు. ఇద్దరు ఉద్యోగులను బలవంతంగా సెలవుపై పంపడాన్ని వ్యతిరేకిస్తూ వారు ఈ ఆందోళనకు దిగారు.
ఈ నెల ఆరంభంలో ఇద్దరు కంపెనీ ఉద్యోగులను గూగుల్ సెలవుపై పంపించింది. వారు కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడంతో ఈ చర్య తీసుకున్నట్లు గూగుల్ ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. అయితే ఎలాంటి హెచ్చరిక చేయకుండానే వారిని బలవంతంగా సెలవుపై పంపించడం శాన్‌ఫ్రాన్సిస్కో కార్యాలయంలోని మిగిలిన ఉద్యోగులకు నచ్చలేదు. వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలంటూ వారు ఆందోళనకు దిగారు.

దీనిపై గూగుల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోన్న జోరాతంగ్ మాట్లాడుతూ.. సంస్థలో లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయని, ఈ విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని.. తాను, తన తోటి ఉద్యోగులు కోరుతున్నామని తెలిపారు. అలాగే వర్కింగ్ కండీషన్స్ మరింత మెరుగ్గా చేయమని అడుగుతున్నామని, కానీ గూగుల్ అధికారులు ఈ విషయాలను పట్టించుకోకపోగా, అణిచివేసే ధోరణిలో ప్రవర్తిస్తున్నారని వాపోయారు.
ఒకప్పుడు గూగుల్ కార్పొరేట్ కల్చర్‌ను ఆకాశానికి ఎత్తేసిన ఉద్యోగులే నేడు గూగుల్ వ్యవహరిస్తోన్న తీరును తూర్పారబడుతున్నారు. సంస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనించినట్లయితే.. ఉద్యోగులకు, గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్‌కు మధ్య వివాదాలు ఉన్నట్లు అర్థమవుతోంది. తాజాగా 200 మంది ఉద్యోగులు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ శాన్‌ఫ్రాన్సిస్కో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications