Google News: ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వైపు సెంట్రల్ బ్యాంకులు దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ తన యూపీఐ చెల్లింపుల వ్యవస్థను విజయవంతంగా అమలు చేయటంతో పాటు ఇతర దేశాలకు సైతం విస్తరింపజేస్తోంది.
ఈ క్రమంలో గూగుల్ తన పేమెంట్స్ యాప్ గూగుల్ పేను ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం గూగుల్ తన పేమెంట్స్ సేవలను అమెరికాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి యాప్‌ను సులభతరం చేయడం ద్వారా వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో అక్కడి వినియోగదారులకు గూగుల్ వాలెట్‌కి బదిలీ చేయబడతారని కంపెనీ వెల్లడించింది. గూగుల్ పే యాప్ జూన్ 4, 2024 నుంచి అందుబాటులో ఉండదని వినియోగదారులను హెచ్చరించింది.

వాస్తవానికి అమెరికాలో గూగుల్ పే వినియోగం కంటే గూగుల్ వాలెట్ వినియోగించే వారి సంఖ్య 5 రెట్లు అధికం. ట్రాన్సిట్ కార్డ్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, స్టేట్ IDలతో పాటు మరిన్నింటి వంటి ఇతర డిజిటల్ వస్తువులతో పాటు, ట్యాప్, పేమెంట్ కోసం ఉపయోగించే పేమెంట్ కార్డ్‌లను స్టోర్‌లలో సురక్షితంగా స్టోర్ చేయడానికి Google Wallet ప్రధాన ప్రదేశంగా కొనసాగుతోంది.
అయితే ఈ ప్రభావం భారతదేశంలోని గూగుల్ పే వినియోగదారులపై ఉండబోదని టెక్ దిగ్గజం గూగుల్ స్పష్టం చేసింది. ఆన్‌లైన్ చెక్అవుట్, స్టోర్‌లో చెల్లింపుల కోసం గూగుల్ పే సాధారణ ఉపయోగం మారదు. యాప్‌లోని భారతీయ, సింగపూర్ వినియోగదారులకు నిర్దిష్ట అవసరాలను తీర్చడం కొనసాగిస్తున్నందున వారికి ఎటువంటి మార్పులు కనిపించవని పేర్కొంది. అలాగే అమెరికాలోని వినియోగదారులు జూన్ 4, 2024 తర్వాత Google Pay వెబ్‌సైట్ ద్వారా బ్యాంక్ ఖాతాలకు నిధులను బదిలీ చేసుకోవచ్చని ప్రకటించింది.


Click it and Unblock the Notifications