వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్స్ పైన తప్పుడు సమాచారం తొలగించే ఉద్దేశ్యంలో భాగంగా చైనాతో లింక్ ఉన్న 2,500 యూట్యూబ్ ఛానల్స్‌ను తొలగించినట్లు సెర్చింజన్ గూగుల్ వెల్లడించింది. వీటిని ఏప్రిల్ - జూన్ మధ్య తొలగించినట్లు తెలిపింది. భారత ప్రభుత్వం గతంలో చైనాకు చెందిన కొన్ని యాప్స్‌ను నిషేధించింది. ఇదే దారిలో మరికొన్ని దేశాలు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలాగే టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు అన్నింటిని సమీక్షిస్తుంది. ఇందులో భాగంగా వీటి తొలగింపు చోటు చేసుకుంది. అయితే కరోనా తర్వాత చైనా యాప్స్, యూట్యూబ్ లింక్స్ తొలగింపు చర్చనీయాంశంగా మారింది.

తప్పుడు సమాచారం కారణంగా వీటిని తొలగించినట్లు తెలిపింది. దీనిపై స్పందించాలని కోరగా అమెరికాలోని చైనీస్ రాయబార కార్యాలయం వెంటనే రెస్పాండ్ కాలేదని తెలుస్తోంది. అయితే గతంలో ఇలాంటి తప్పుడు సమాచార వ్యాప్తికి సంబంధించి ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం ఖండించింది.
గతంలో ఇతర దేశాలతో సంబంధం ఉన్న నటులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు సందేశాలు పంప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2016 ప్రెసిడెంట్ ఎన్నికల సమయం నుండి రాజకీయ నాయకులు, టెక్ సంస్థలకు ఈ అంశం ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో గూగుల్, ఫేస్ బుక్ వంటి సంస్థలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నాయి.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications