Google Perks Cut: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్ ఈటీవల 12,000 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు దీని నుంచి తేరుకోక ముందే సంస్థ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ కంపెనీని కాపాడేందుకేనని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.
ఒకప్పుడు ప్రపంచ దిగ్గజాలుగా చెప్పుకున్న కంపెనీలు ఇప్పుడు దయ లేకుండా ప్రవర్తిస్తున్నాయి. వ్యాపార సామ్రాజ్యాలకు బీటలు వారకుండా కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి. అయితే ఇవి ఈ సారి మరింత తీవ్రతరంగా మారాయి. Google ఒకప్పుడు ఉద్యోగులకు మంచి పెర్క్‌లను అందించడంలో, వారిని బాగా చూసుకోవడంలో పేరుగాంచిన సంస్థ.. అయితే ఇప్పుడు కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాలపై చాలా మంది ఉద్యోగులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా మెటా మరో దఫాలో 10,000 మంది యాడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను తన గ్రూప్ కంపెనీల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఇదే క్రమంలో కాగ్నిజెంట్ 19,000 మందిని తొలగించేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇక మరో అమెరికా దిగ్గజ సంస్థ వాల్ట్ డిస్నీ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించటంతో దాదాపు 15 శాతం మంది ఉద్యోగులు ప్రభావితం అవనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా కంపెనీలు తమ వద్ద ఉన్న తక్కువ నిధులను వృదా కాకుండా చూసుకోవాలని నిర్ణయించాయి.
ఇక గూగుల్ విషయానికి వస్తే.. ఉద్యోగులకు అందిస్తున్న ఉచిత మసాజ్, క్యాంపస్ షటిల్ బస్సులు, ఫిట్‌నెస్ సౌకర్యాలను నిలిపివేయాలని నిర్ణయించింది. దీనికి తోడు గూగుల్ ఉద్యోగులకు అందిస్తున్న ఆహారం విషయంలోనూ చాలా మార్పులు చేసింది. ఆహార బడ్జెట్ ను కంపెనీ తగ్గిచటంపై కూడా ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రఖ్యాత సంస్థ మెల్లగా ఉద్యోగులకు అందిస్తున్న అనేక సౌకర్యాలను తొలగించటం లేదా తాత్కాలికంగా నిలిపివేయటం చేస్తోంది.
ఈ విషయాలపై స్పందిస్తున్న ప్రస్తుత, తొలగించబడిన మాజీ ఉద్యోగులు తమ అనుభవాలను పంచుకున్నారు. గూగుల్ తన కేఫ్ తెరిచే వేళలను అలాగే కంపెనీలో ల్యాప్‌టాప్‌లను ఎంత తరచుగా మార్చుకునే అవకాశాలను తగ్గిచటాన్ని తగ్గించింది. ఖర్చుల తగ్గింపులో భాగంగా ఇలా చేస్తున్నట్లు కంపెనీలు తన ఉద్యోగులకు పంపిన మెమోలో వెల్లడించినట్లు ఒక ఉద్యోగి వెల్లడించాడు.
మార్చుకోవచ్చో తగ్గిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని టెక్ దిగ్గజం ఉద్యోగులకు పంపిన మెమోలో ధృవీకరించింది మరియు ఇది కొంత ఖర్చులను ఆదా చేయడంలో కూడా సహాయపడుతుందని నొక్కి చెప్పింది.


Click it and Unblock the Notifications