అల్గారిథం అప్‌డేట్‌ను విడుదల చేస్తున్నట్లు గూగుల్‌కు చెందిన డానీ సలివాన్ వెల్లడించారు. ఈ అప్‌డేట్‌ను మే 2020 కోర్ అప్‌డేట్‌గా పేర్కొన్నారు. గూగుల్‌కు ఇది ఈ ఏడాదిలో (2020) రెండో కోర్ అప్‌డేట్. ఇంతకుముందు జనవరి 2020 కోర్ అప్ డేట్ చేసింది. ఇప్పుడు మరోసారి చేస్తోంది. సాధారణంగా గూగుల్ కొద్ది నెలలకు ఓసారి గూగుల్ అల్గారిథం అప్ డేట్‌ను రిలీజ్ చేస్తుంది. ఈసారి జనవరిలో చేసిన తర్వాత దాదాపు నాలుగు నెలలకే చేస్తోంది.
ప్రతిసారి చేసే విధంగానే బ్రాడ్ కోర్ అల్గారిథం అప్ డేట్‌ను విడుదల చేస్తున్నామని, దీనిని మే కోర్ అప్ డేట్‌గా పిలుస్తున్నట్లు గూగుల్ నిన్న ట్వీట్ చేసింది. ట్వీట్ చేసిన కాసేపటికి కోర్ అప్ డేట్ ప్రారంభమైనట్లు తెలిపింది. పూర్తిగా అప్ డేట్ కావడానికి ఒకటి నుండి రెండు వారాలు పడుతుందని పేర్కొంది.
అంతకుముందు జనవరి 2020 కోర్ అప్ డేట్, చేసింది. దీని కంటే ముందు సెప్టెంబర్ 2019 కోర్ అప్ డేట్ చేసింది. ఆ తర్వాత నవంబర్ నెలలోను అప్ డేట్ విడుదల చేసింది. అయితే ఇది ప్రత్యేకంగా లోకల్ ర్యాంకింగ్స్‌కు సంబంధించినది.

సైట్స్ ర్యాంకింగ్స్ డ్రాప్ లేదా అప్
అన్ని దేశాలలో, అన్ని భాషలలో సెర్చ్ రిజల్ట్స్ మరింత సులభతరం చేసేందుకు బ్రాడ్ కోర్ అప్ డేట్ డిజైన్ చేస్తారు. కోర్ అప్ డేట్ వచ్చినప్పుడు సైట్స్ అనివార్యంగా సెర్చ్ ర్యాంకింగ్స్‌లో డ్రాప్స్ లేదా అప్ గమనించవచ్చు. ర్యాంకింగ్స్ మార్పు సాధారణంగా కంటెంట్‌కు ఆధారితం. అంటే గత చివరి అప్ డేట్ నుండి కంటెంట్‌లో మార్పు ఆధారంగా ర్యాంకింగ్స్ ముందుకు, వెనక్కి వెళ్తాయి. అలాగే గత అప్ డేట్ సమయంలో లేని కంటెంట్ ఉంటుంది. వీటన్నింటిని తిరిగి సమీక్షించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ర్యాంకింగ్స్‌లో మార్పులు ఉంటాయి.

కరోనా తర్వాత తొలి అప్ డేట్
కరోనా మహమ్మారి తర్వాత ఇది మొదటి అప్ డేట్. కాబట్టి మే 2020 కోర్ అప్ డేట్ కాస్త అస్థిరతను కలిగి ఉండవచ్చు. చివరి కోర్ అప్ డేట్ జనవరి 2020 రెండో వారంలో ప్రారంభించింది. ఆ సమయంలో కరోనా వెలుగుచూసినప్పటికీ అంతగా ప్రభావం లేదు. కానీ దీనిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మహమ్మారిగా ప్రకటించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. లక్షల మరణాలు చోటు చేసుకున్నాయి. ఇది యూజర్ సెర్చింజన్ బిహేవియర్‌లో గణనీయమైన మార్పు తీసుకు వచ్చింది. కరోనా మహమ్మారి కోసం గత కొన్ని నెలలుగా వెతుకుతున్నట్లు మరే దాని కోసం ఇంతలా వెతకలేదని గూగుల్ తెలిపింది.

వీటి కోసం బాగా వెతికారు.. ఇవి డౌన్
కరోనా మహమ్మారి నేపథ్యంలో కోవిడ్ 19 కోసం ఎక్కువగా సెర్చ్ చేయడంతో పాటు రిమోట్ సేవలు, ఆన్‌లైన్‌లో అవసరమైన ఉత్పత్తుల కోసం కూడా వెతికారు. ఇంతకుముందు సెర్చ్ చేయని ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇంతకు ముందు కంటే భిన్నంగా సెర్చ్ చేశారు. ఉదాహరణకు ట్రావెల్, టూరిజం, లైవ్ ఎంటర్టైన్మెంట్ వంటి వాటి గురించి సెర్చ్ చేయడం తగ్గింది.

SEO జాబ్ మార్కెట్‌కు ప్రయోజనం
మే 2020 కోర్ అప్ డేట్ ( May 2020 Core Update) ఎస్ఈవో జాబ్ మార్కెట్‌కు ప్రయోజనంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక మాంద్యం కారణంగా ఉద్యోగాల తొలగింత చోటు చేసుకుంటుంది. క్లయింట్స్ సేవలు నిలిపివేస్తున్నారు. అయితే అల్గారిథం అప్ డేట్ జరిగినప్పుడు ఎస్ఈవోలు అందించే సేవలు ఎంతో విలువైనవి. కరోనా కారణంగా అప్ డేట్ అస్థిరత కలిగి ఉంటే ఎస్ఈవో సేవలు ఎంతో అవసరం. దీనికి డిమాండ్ పెరుగుతుంది. మే 2020 కోర్ అప్ డేట్ నేపథ్యంలో ఎన్ని కంపెనీలు ఎంత మేరకు బడ్జెట్‌ను కేటాయిస్తాయనేది ఆసక్తికరమే.

సైట్ ఓనర్స్ ఏం చేయాలి
ఈ అప్ డేట్ కూడా గతంలో చేసిన అప్ డేట్స్ మార్గదర్శకాలతోనే ఉంటుంది. కోర్ అప్ డేట్ తర్వాత ర్యాంకులు పడిపోతే పరిష్కారం లేదని గూగుల్ ఎప్పుడూ చెబుతుంది. దీనికి బదులు సైట్ యజమానులు తమ కంటెంట్‌ను మరింత ఉత్తమంగా మార్చుకోమని సలహా ఇస్తుంది గూగుల్.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications