ముంబై: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్.. స్మార్ట్‌ఫోన్ల తయారీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. పిక్సెల్ 5ఎ 5జీ (Pixel 5a 5G) పేరుతో హ్యాండ్‌సెట్‌ను తయారు చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ల తయారీని గూగుల్ నిలిపివేసిందనే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. దీనితో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వార్తలకు గూగుల్ యాజమాన్యం పుల్‌స్టాప్ పెట్టింది. ఈ స్మార్ట్‌ఫోన్లను తాము తయారు చేస్తున్నామని గూగుల్ అనుబంధ సంస్థ 9 టు 5 గూగుల్ (9to5Google) వెల్లడించింది.
ఈ మేరకు ఆ సంస్థ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాదే ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి సైతం అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో భారతీయ మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టడంలో మరింత జాప్యం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పిక్సెల్ 5ఎ 5జీ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాదిలోనే అందుబాటులోకి వచ్చినప్పటికీ.. మనదేశంలో మాత్రం ఇప్పుడప్పుడే అది ప్రత్యక్షం కాదు. వచ్చే ఏడాదే అది మనదేశ మార్కెట్‌లో ఎంట్రీ ఇస్తుంది.

గూగుల్ పిక్సెల్ 5ఎ 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రాజెక్ట్ రద్దు కాలేదని 9 టు 5 గూగుల్ సంస్థ అధికార ప్రతినిది స్పష్టం చేశారు. ఈ ఏడాదిలోనే అమెరికా, జపాన్‌లల్లో దాన్ని లాంచ్ చేస్తామని తెలిపారు. మరిన్ని దేశాలు పైప్‌లైన్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. గూగుల్ అభివృద్ధి చేసిన పిక్సెల్ 4ఎ స్మార్ట్‌ఫోన్ గత ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదలైంది. ఈ ఏడాది ఆగస్టులోనే పిక్సెల్ 5ఏ 5జీ కూడా ఆవిష్కరించే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు.
చిప్‌ల కొరత వల్ల పిక్సెల్ 5ఎ 5జీ స్మార్ట్‌ఫోన్ల తయారీని గూగుల్ నిలిపివేసిందంటూ మొదట్లో వార్తలొచ్చినప్పటికీ.. తాజాగా ఇచ్చిన వివరణతో అది వాస్తవం కాదని తేలిపోయినట్టయింది. కాకపోతే- ఈ స్మార్ట్‌ఫోన్ మనదేశంలో అడుగు పెట్టడానికి చాలా సమయం పట్టే అవకాశాలు లేకపోలేదు.వెస్టర్న్ కంట్రీస్‌లో అమెరికా, ఆసియన్ దేశాల్లో జపాన్‌ను మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి ఎంచుకుందా సంస్థ. అక్కడి డిమాండ్‌కు అనుగుణంగా ప్రొడక్ట్‌ను చేపట్టిన తరువాతే భారత్‌లో దాన్ని విడుదల చేయొచ్చు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్‌ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

డబ్బు కావలిసినంత ఉన్నా పర్సనల్ లోన్ల వైపు పరిగెత్తుతున్న ధనవంతులు.. కారణం ఏంటంటే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications