కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆదేశాలు అమలుచేస్తే.. స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరుగుతాయని, వినియోగదారుల భద్రత ప్రమాదంలో పడుతుందని గూగుల్ ఓ పోస్ట్‌లో హెచ్చరించింది. 'ఫోర్క్'గా పిలిచే ఈ సంస్కరణల వల్ల తమ పేటెంట్ అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు భిన్నంగా ప్రత్యేక మార్పులు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. తద్వారా సంస్థ అందించే భద్రతా ప్రమాణాలను పొందే అవకాశం ఉండదని తెలిపింది.

సుప్రీం తలుపుతట్టిన గూగుల్:
వాటి భద్రత కోసం ఫోన్ల తయారీదారులే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని టెక్ దిగ్గజం అభిప్రాయ పడింది. తద్వారా ఫోన్ల ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పింది. NCLAT సైతం ట్రిబ్యునల్ ఆదేశాలపై మధ్యంతర స్టేకు నిరాకరించడంతో.. చివరకు సుప్రీం కోర్టు ఎదుట ఈనెల 16న గూగుల్ తన వాదనలు వినిపించనుంది.

చిన్న డెవలపర్‌లకు పెద్ద దెబ్బ..
ప్రస్తుత అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా చిన్న డెవలపర్‌లు సైతం చాలా తేలికగా అప్లికేషన్‌లు తయారు చేసి వినియోగదారులకు అందించగలుగుతున్నారని గూగుల్ పేర్కొంది. పెద్ద డెవలపర్‌లతో పోటీపడే స్థాయిలో ఉన్నారంది. 'ఫోర్క్'ల వల్ల ఈ తరహా అవకాశం లభించదని అభిప్రాయపడింది. తద్వారా నాణ్యతతో సంబంధం లేకుండా పెద్ద డెవలపర్‌లే ఆధిపత్యం సాధించే ప్రమాదం ఉందని పేర్కొంది. సైబర్ క్రైమ్, బగ్స్, మాల్వేర్ పరంగా ఎదుర్కొనే సమస్యలపై సీసీఐ పునరాలోచించాలని కోరింది.

సీసీఐ ఆదేశాలేంటి ?
అండ్రాయిడ్ ఎకో సిస్టంలో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై.. గత రెండు ఆదేశాల్లో గూగుల్‌కు రూ. 1,337 కోట్లు, రూ. 936 కోట్లు సీసీఐ జరిమానా విధించింది. అంతేకాకుండా అండ్రాయిడ్ మార్కెట్, ప్లే స్టోర్‌లోనూ సంస్థ గుత్తాధిపత్యాన్ని నిరోధించడానికి పలు మార్పులు చేయాలని ఆదేశించింది. ఫోన్ల తయారీదారులు గూగుల్ అందించే సెర్చ్, క్రోమ్, యూట్యూబ్, ఇతర అప్లికేషన్లను ముందుగా ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా చూడాలని తీర్పునిచ్చింది. ప్లే స్టోర్ లైసెన్సింగ్‌ను ఇతర సర్వీసులతో ముడిపెట్టకూడదని వెల్లడించింది.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications