Google కో ఫౌండర్.. లారీ పేజ్ (Larry Page) ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన Alphabet స్టాక్ ధరలు విపరీతంగా పెరగడంతో.. Oracle కో ఫౌండర్ లారీ ఎల్లిసన్ ను వెనక్కి నెట్టి ఈ స్థానాన్ని దక్కించుకున్నారు.

ఫార్చ్యూన్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం లారీ పేజ్ యొక్క నికర సంపద ప్రస్తుతం.. 255 బిలియన్ డాలర్లు. ప్రపంచంలో 2వ ర్యాంక్. మొదటి స్థానంలో ఎలన్ మస్క్ ఉన్నారు. ఇతని సంపద 475.5 బిలియన్ డాలర్లు. ఇక మూడవ స్థానంలో లారీ ఎల్లిసన్ ఉన్నారు. ఇతరని ఆస్తి 250.7 బిలియన్ డాలర్లు. లారీ పేజ్ సంపద కేవలం ఒక్క రోజులోనే సుమారు 6% పెరిగింది. 2024లో ఇతని సంపద 114 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఈ ఏడాది బాగా పెరిగింది. అయితే మొన్న ఒక్కరోజే ఆల్ఫాబెట్ సంస్థ షేర్లు భారీ లాభాలు అందుకోవడంతో ఇతని సంపద కూడా భారీగా పెరిగింది.
ఆల్ఫాబెట్ స్టాక్స్ ఇలా..
లారీ పేజ్ సంపదలో ఈ అసాధారణ పెరుగుదలకు ప్రధాన కారణం Google మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ (Alphabet) స్టాక్ ధరలో వచ్చిన అద్భుతమైన ర్యాలీ. గత ఆరు నెలల్లో స్టాక్ 83% కంటే ఎక్కువ పెరిగి 318.5 డాలర్లకు చేరుకుంది. గత ఒక సంవత్సరంలో సుమారు 88% పెరిగింది. 2025లో ఇప్పటివరకు దాదాపు 67% పెరిగింది. మార్కెట్ విలువ: ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ ప్రస్తుతం దాదాపు 3.82 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. త్వరలోనే 4 ట్రిలియన్ల మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ పెరుగుదల ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో Google తీసుకుంటున్న నిర్ణయాలే అని చెప్పొచ్చు.
జెమినీ ఏఐతో..
2022లో ChatGPT విడుదలైన తర్వాత AI రేసులో Google వెనుకబడిందనే భావన కొంతకాలం నెలకొంది. అయితే, Gemini 3 AI మోడల్‌ను విడుదల చేయడం ద్వారా Google శక్తివంతమైన పునరాగమనాన్ని చేసింది. Gemini 'Nano Banana' మోడల్ వైరల్ అయిన తర్వాత, Gemini యాప్‌లో 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు చేరారు. ఈ టూల్ ని ఉపయోగించి ఇప్పటికే 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫొటోలు సృష్టించబడ్డాయి. దీనికి అదనంగా, ఆల్ఫాబెట్ యొక్క క్లౌడ్ విభాగం Google Cloud కూడా బలమైన వృద్ధిని కనబరుస్తోంది.
లారీ ఎల్లిసన్ సంపద పతనం
దీనికి విరుద్ధంగా Oracle సహ-వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ సంపద భారీగా పడిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో 400 బిలియన్ డాలర్ల సంపదను దాటిన రెండో వ్యక్తిగా ఆయన నిలిచినప్పటికీ.. Oracle స్టాక్ సెప్టెంబర్ గరిష్ట స్థాయిల నుండి 43 శాతం పడిపోవడంతో.. ఆయన సంపద 248.8 బిలియన్ డాలర్లకు తగ్గింది. లారీ పేజ్ సంపద పెరుగుదల, ఎల్లిసన్ సంపద పతనం.. ఈ రెండింటినీ చూస్తే.. ఏఐ బేస్డ్ టెక్నాలజీ టెక్ ప్రపంచాన్ని ఎలా వేగంగా మారుస్తుందో స్పష్టంగా తెలుసస్తుంది.


Click it and Unblock the Notifications