Job at Google: గూగుల్‌లో జాబ్ కొట్టాలంటే కావాల్సిన స్కిల్స్ చెప్పిన సుందర్ పిచాయ్..
Google News: అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ సంస్థలో ఉద్యోగం సంపాదించాలని చాలా మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు కలలు కంటుంటారు, అయితే ఈ సంస్థలో అంత సులువుగా జాబ్ రాదనేది వాస్తవం. ఇక్కడ అత్యధిక వేతనంతో పాటు వర్క్ కల్చర్ కూడా బాగుంటుందని చాలా మంది చెబుతుంటారు. అయితే ప్రస్తుతం ఈ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్న భారతీయ వ్యక్తి సుందర్ పిచాయ్ కీలకమైన కొన్ని విషయాలను ఉద్యోగార్థుల కోసం వెల్లడించారు.
ఇటీవలి కాలంలో రిక్రూట్మెంట్ సమయంలో గూగుల్ ఉద్యోగుల నియామకం కోసం ముఖ్యంగా ఇంజనీరింగ్ జాబ్స్ విషయంలో అభ్యర్థుల్లో వెతుకుతున్న నైపుణ్యాలకు సంబంధించిన విషయాలపై ఓపెన్ అయ్యారు. ఉద్యోగార్థుల్లో సాంకేతికంగా నైపుణ్యం, అనుకూలత కలిగి ఉండాల్సిన అవసరాన్ని ది డేవిడ్ రూబెన్‌స్టెయిన్ షోలో మాట్లాడుతూ పిచాయ్ నొక్కి చెప్పారు. వేగంగా మారిపోతున్న సాంకేతిక ప్రపంచంలో తాము వృద్ధి చెందగల సూపర్ సూపర్ స్టార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కోసం కంపెనీ అన్వేషణ కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఉద్యోగుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణలను పెంపొందించే విధంగా గూగుల్ పని సంస్కృతి ఉంటుందని పిచాయ్ పేర్కొన్నారు.

గూగుల్ తన ఉద్యోగులకు ఉచితంగా ఆహారాన్ని అందించటం సమాజాన్ని నిర్మిచంటంతో పాటు కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది. కేఫ్‌లో ఊహించని సంభాషణలు ఎలా ఉత్తేజకరమైన ప్రాజెక్ట్‌లకు దారితీస్తాయో పిచాయ్ గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చు కంటే విలువ ఎక్కువని పేర్కొన్నారు. గూగుల్ ఎల్లప్పుడూ ప్రతిభకు అగ్రస్థానం ఇస్తుందని, పరిశ్రమ అంతటా ఉద్యోగాలు అందించటంలో మందగమనం కొనసాగుతున్నా గూగుల్ ముందుకు సాగటంపై హర్షం వ్యవహరించారు. జూన్ 2024 నాటికి 179,000 మంది ఉద్యోగులను కంపెనీ కలిగి ఉంది.
గూగుల్ మాజీ రిక్రూట్మెంట్ అధికారి నోలన్ చర్చిల్ గతంలో కంపెనీలో పాటించే నియామక ప్రక్రియ గురించి కొన్ని వివరాలను పంచుకున్నారు. ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఉద్యోగార్థులు బాగా సిద్ధంగా ఉండాలని, గూగుల్ విలువలు, మిషన్ గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. వారు గతంలో సాధించిన విజయాల గురించి గూగుల్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇదే క్రమంలో ఇచ్చిన ఆఫర్ కంటే 40-100 శాతం అధికంగా డిమాండ్ చేయటాన్ని రిక్రూట్మెంట్ టీమ్ పరిగణలోకి తీసుకోదని చెప్పారు. ఒక ఫ్రెషర్ ఉద్యోగి ఇంటర్వ్యూ సమయంలో కంపెనీ ఆఫర్ చేసిన ప్యాకేజ్ కంటే దాదాపు బడుల్ అడిగాడని, అయితే దీనికి నిజంగా అర్హతకోసం అతని వద్ద డేటా పేర్కొనలేదని చర్చిల్ పేర్కొన్నారు. కంపెనీ వర్క్ కల్చర్ లో ఇమడగడితే ప్రతిభావంతులకు మాత్రమే గూగుల్ ప్రాధాన్యత ఇస్తుందని ప్రస్తుతం పైన పేర్కొన్న వివరాల ప్రకారం తెలుస్తోంది.


Click it and Unblock the Notifications