Google Search: గూగుల్ CEO దీపావళి శుభాకాంక్షలు.. Xలో షేర్ చేసిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
Google Search: దేశ ప్రజలందరూ నిన్న దీపావళి సంబరాల్లో మునిగితేలారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు తమైదన శైలిలో లక్ష్మీపూజ నిర్వహించి ఘనంగా పండుగ జరుపుకున్నారు. పలువురు ప్రముఖులు భారతీయులకు శుభాకాంక్షలు తెలపగా.. గూగుల్ CEO సుందర్ పిచాయ్ కూడా విషెస్ చెప్పారు. అయితే ఈ సందర్భంగా తన Xలో షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
సుందర్ పిచాయ్ దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపుతూ Xలో ఓ పోస్ట్ చేశారు. అందులో ప్రపంచవ్యాప్తంగా ఈ హిందూ పండుగ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఉపయోగించిన టాప్ 'Why' సెర్చ్‌లను షేర్ చేశారు. వెలుగుతున్న దీపంతో కూడిన ఫొటోను దీనికి జతచేశారు.

'దీపావళి జరుపుకునే వారందరికీ శుభాకాంక్షలు! గూగుల్ సెర్చ్‌లో దీపావళి సంప్రదాయాల గురించి ప్రజలు చాలా ఆసక్తిని కనబరిచారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ లో ఉన్న 'Why' ప్రశ్నలు ఇక్కడ చూడొచ్చు' అని కామెంట్ చేశారు. దీపం ఫొటోలోని పాయింట్లపై క్లిక్ చేస్తే ఈ అయిదు ప్రశ్నలు ఒక్కొక్కటిగా కనిపించే GIF ని యూజర్లతో పంచుకున్నారు.
దీపావళి: భారతీయులు దీపావళిని ఎందుకు జరుపుకుంటారు?
రంగోలి: దీపావళి రోజున రంగోలీ ఎందుకు చేస్తారు?
వెలుగు: దీపావళి రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తాం?
పూజ: దీపావళి రోజున లక్ష్మీపూజ ఎందుకు చేస్తారు?
నూనె: దీపావళి రోజున నూనెతో స్నానం ఎందుకు చేస్తారు?
దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగలలో దీపావళి ఒకటి. సాంప్రదాయ కథనాల ప్రకారం.. 14 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారని ప్రతీతి. శ్రీకృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురుడిని వధించినందుకు గాను.. నూనె దీపాలను వెలిగించి చీకటిపై విజయానికి ప్రతీకగానూ ఈ పండుగను భావిస్తారు.


Click it and Unblock the Notifications