Google Layoffs: టెక్ కంపెనీల్లో కొలువుల కోతల కాలం కొనసాగుతోంది. రోజుకో కంపెనీ మెుహమాటం లేకుండా ఉద్యోగుల తొలగింపులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ నుంచి అతిపెద్ద ప్రకటన ప్రస్తుతం ఉద్యోగల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సహా కొత్త ప్రాధాన్యతలపై దృష్టి సారించిన గూగుల్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజంలో మరిన్ని ఉద్యోగాల తొలగింపులు తప్పవని భారత సంతతికి చెందిన సీఈవో సుందర్ పిచాయ్ టెక్కీలను హెచ్చరించారు. ఈ రోల్ ఎలిమినేషన్‌లు గత సంవత్సరం తగ్గింపుల స్థాయిలో లేవని, ప్రతి బృందాన్ని తాకబోవని సిబ్బందికి తాజాగా పంపిన ఈమెయిల్ ద్వారా వెల్లడించారు. మార్పుల్లో చాలా వరకు ఇప్పటికే ప్రకటించబడ్డాయని, కొన్ని బృందాలు అవసరమైన చోట ఏడాది పొడవునా నిర్దిష్ట వనరుల కేటాయింపు నిర్ణయాలను తీసుకుంటాయని, కొన్ని పాత్రలు ప్రభావితం కావచ్చన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రమాదాల కారణంగా గూగుల్ గడచిన ఏడాది కాలంలో ఏకంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇదే క్రమంలో పనిలో సమర్థత, సృజనాత్మకత కోసం AIని ఉపయోగించాలనే ఒత్తిడి మధ్య కంపెనీ తన గ్లోబల్ యాడ్ టీమ్ నుంచి వందల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇవి గూగుల్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రకటనలు చేసే చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు మెరుగైన మద్దతును అందించే క్రమంలో తీసుకున్న కోతలుగా చెప్పబడింది.
ఇదే క్రమంలో తాజాగా బుధవారం నాడు వీడియో ఫ్లాట్ ఫారమ్ యూట్యూబ్ దాదాపు 100 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడైంది. అలాగే యూట్యూబ్ ఉద్యోగులు తమ తొలగింపులు అమలులోకి రావడానికి ముందు కంపెనీలో కొత్త రోల్స్ కనుగొనడానికి రెండు నెలల సమయం అందించబడింది. ఇది ఒక విధంగా వారికి టెక్ దిగ్గజం గూగుల్ అందిస్తున్న ఊరటను వారికి అందించింది.
కొత్త ఏడాది 2024 ప్రారంభం నుంచి గమనిస్తే అమెజాన్ తన ట్విచ్ వీడియో స్ట్రీమింగ్, మెజాన్ MGM స్టూడియోలలో వందలాది మంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సిబ్బందిని కూడా తగ్గించింది. కరోనా కాలంలో అమెరికాకు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ దాదాపు 20,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. అలాగే అమెజాన్ మెుత్తంగా 27,000 మందిని తొలగించాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications