e-Conomy report: భారతదేశంలో ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి 6 రెట్లు వృద్ధి చెందుతుందని అంచనా. తద్వారా ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని గూగుల్ ఇండియా మేనేజర్ & వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా భావిస్తున్నారు. ఇ-కామర్స్ వర్టికల్స్ ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. భవిష్యత్తులో చాలా వరకు కొనుగోళ్లు డిజిటల్‌గా జరుగుతాయని చెప్పారు.
గూగుల్, బైన్ & కంపెనీ మరియు టెమాసెక్ సంయుక్తంగా 'ఇండియా ఇ-కానమీ రిపోర్ట్' పేరిట ఓ నివేదికను ప్రచురించింది. "వినియోగదారులు, వ్యాపారుల ప్రవర్తనలో నిరంతర మార్పు, బలమైన పెట్టుబడిదారుల విశ్వాసం వెరసి భారతదేశాన్ని 'డిజిటల్ దశాబ్దం'లోనికి తీసుకువచ్చాయి. 2030 నాటికి ట్రిలియన్ డాలర్ల ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థను చేరుకునే ప్రయాణంలో ఇండియా ఉంది. ప్రస్తుతం 700 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. వారిలో సగానికిపైగా డిజిటల్ చెల్లింపులు చేస్తుండగా.. 220 మిలియన్ల మంది ఆన్‌లైన్ షాపర్స్ ఉన్నారు" అని అందులో పేర్కొంది.

ఇండియా ఇంటర్నెట్-ఆర్థిక వ్యవస్థ 2022లో 155 నుంచి 175 బిలియన్ డాలర్ల పరిధిలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఇందులోనూ B2C ఇ-కామర్స్ విభాగం ద్వారా మూడింట ఒకవంతు వృద్ధిని ఆశించవచ్చని పేర్కొంది. "చిన్న పట్టణాలు మరియు నగరాల్లో పెరిగిన వ్యాప్తి కారణంగా, B2C ఇ-కామర్స్ GMV నేడు 65 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. ఇది 2030 నాటికి 6 రెట్లు పెరిగి 380 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని అంచనా వేసింది.
'ఇండియా ఇ-కానమీ రిపోర్ట్' ప్రకారం.. B2C ఇ-కామర్స్ 2030 నాటికి 5-6 రెట్లు వృద్ధి చెంది 350-380 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. B2B ఇ-కామర్స్ 13-14 రెట్లు పెరిగి 105-120 బిలియన్ డాలర్లు, సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ విభాగం 5-6 రెట్లు వృద్ధి చెంది 65-75 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్, డిజిటల్ చెల్లింపులు మరియు సోషల్ మీడియాలో వినియోగదారులు గడిపే సమయాలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications