google case: గూగుల్ కేసులో కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తీర్పు గురించి అందరికీ తెలిసిందే. పెనాల్టీ కట్టడానికి నిరాకరించిన టెక్ దిగ్గజం, NCLATని అనంతరం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే CCI ఆదేశాలను సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం, NCLATలోనే ఈ విషయం తేల్చుకోమని చెప్పింది. మార్చి 31లోగా తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా ట్రిబ్యునల్ కు సూచించింది.

పెనాల్టీ విధింపు అన్యాయం
ఇతర యాప్ లు ఇన్ స్టాల్ చేయకుండా మైబైల్ యాప్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్(MADA) ద్వారా పరికరాల తయారీదారులను తాము అడ్డుకోవడం లేదని NCLATకి గూగుల్ తెలిపింది. బయటి అప్లికేషన్ లు ఇన్ స్టాల్ చేయకుండా ఎటువంటి పరిమితి విధించలేదని వెల్లడించింది. వాటి కోసం తగినంత స్పేస్ అందుబాటులోనే ఉంచినట్లు చెప్పింది. CCI తమపై అన్యాయంగా పెనాల్టీ విధించినట్లు పేర్కొంది.

నచ్చిన యాప్ లు డౌన్లోడ్ చేసుకోవచ్చు
టెక్ దిగ్గజం గూగుల్ తరఫున సీనియర్ న్యాయవాది అరుణ్ కథ్ పాలియా వాదనలు వినిపించారు. ముందే యాప్ లను ఇన్ స్టాల్ చేస్తూ, గూగుల్ ఆధిపత్య ధోరణిని అనుసరిస్తుంది అనుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి నచ్చిన యాప్ లను ప్లే స్టోర్ నుంచి అండ్రాయిడ్ వినియోగదారులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

OEMలకు సైతం ఇబ్బంది లేదు
గూగుల్ మైబైల్ సూట్(GMS) వల్ల ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మాన్యుఫాక్చరర్స్(OEM)కు సైతం ఏ ఇబ్బంది లేదని వారే చెబుతున్నట్లు NCLATకి కథ్ పాలియా చెప్పారు. గూగుల్ యాప్ ల వల్ల తమ ఉత్పత్తులను మరింత విక్రయించ గలుగుతున్నట్లు వెల్లడించారని తెలిపారు. పైగా వారి నుంచి ఎటువంటి రాయల్టీని సైతం గూగుల్ వసూలు చేయడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో GMS వల్ల OEMలకు గానీ, వినియోగదారులకు గానీ హాని జరుగుతుందని భావించడం సబబు కాదని విన్నవించారు.

రోజువారీ విచారణ
NCLAT ఛైర్ పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల బెంచ్ ఎదుట గూగుల్ తన వాదనలు వినిపించింది. అయితే ఫిబ్రవరి 23 నుంచి ఈ వ్యవహారంపై రోజువారీ విచారణ ప్రారంభించనున్నట్లు ట్రిబ్యునల్ శుక్రవారం ప్రకటించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications