అమెరికాలో ఉన్న భారతీయులకు ఇప్పుడు ఎక్కడలేని చిక్కులు వచ్చి పడ్డాయి. అమెరికాలో స్థిరపడాలనే కోరికతో అక్కడికి వెళ్లిన ఐటీ ఉద్యోగులకు ఇప్పుడు గడ్డుకాలం మొదలైంది. గూగుల్ (Google), యాపిల్ (Apple) వంటి అగ్రశ్రేణి కంపెనీలు తమ ఉద్యోగులకు ఒక సంచలన హెచ్చరిక జారీ చేశాయి. ప్రస్తుతం అమెరికాలో పని చేస్తున్న విదేశీయులు, ముఖ్యంగా వర్క్ వీసాలపై ఉన్నవారు అంతర్జాతీయ ప్రయాణాలు (ముఖ్యంగా సొంత దేశాలకు వెళ్లడం) పెట్టుకోవద్దని అంతర్గత మెమోలను పంపాయి. దీని వెనుక కారణం ఏంటంటే..

ఎందుకు ఈ హెచ్చరిక?
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీసా నిబంధనలను అత్యంత కఠినతరం చేశారు. కొత్తగా H-1B వీసా అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఏకంగా 1,00,000 డాలర్లు (సుమారు రూ. 84 లక్షలు) ఫీజు చెల్లించాలని నిర్ణయించడం ఇప్పటికే షాక్ ఇచ్చింది. తాజాగా వీసా స్టాంపింగ్ ప్రక్రియలో వస్తున్న జాప్యం ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అమెరికా వెలుపల ఉన్న యూఎస్ ఎంబసీలలో అపాయింట్‌మెంట్లు దొరకడానికి ఇప్పుడు ఏకంగా 12 నెలల సమయం పడుతోందని రిపోర్టులు చెబుతున్నాయి.
సోషల్ మీడియాపై 'డేగ కన్ను'!
వీసా జాప్యానికి ప్రధాన కారణం అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త 'డీపర్ చెక్స్'. ఇప్పుడు కేవలం మీ రెజ్యూమె చూసి వీసా ఇవ్వడం లేదు.
- దరఖాస్తుదారుడితో పాటు వారి కుటుంబ సభ్యుల లింక్డ్ ఇన్ (LinkedIn) ప్రొఫైల్స్, సోషల్ మీడియా ఖాతాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
- ముఖ్యంగా గతంలో మిస్ ఇన్ఫర్మేషన్ (తప్పుడు సమాచారం), ఫ్యాక్ట్ చెకింగ్, కంటెంట్ మోడరేషన్ లేదా ఆన్‌లైన్ సేఫ్టీ రంగాల్లో పనిచేసిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు.
- ఈ లోతైన తనిఖీల వల్ల వీసా స్టాంపింగ్ ప్రక్రియ నెలల తరబడి సాగుతోంది.
ఎవరెవరికి ప్రమాదం?
ఈ హెచ్చరిక కేవలం H-1B వీసాదారులకు మాత్రమే కాదు.. కింది వీసాలు కలిగిన వారందరికీ వర్తిస్తుందని గూగుల్ తన మెమోలో పేర్కొంది..
- • H-1B & H-4 (వర్క్ వీసా, వారి కుటుంబ సభ్యులు)
- • F Visas (స్టూడెంట్ వీసా)
- • J, M Visas (ఎక్స్ఛేంజ్ విజిటర్స్, ఇతర కేటగిరీలు)
ఒక్కసారి అమెరికా దాటి బయటకు వెళ్తే.. వీసా స్టాంపింగ్ అవ్వక అక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉందని, దానివల్ల ఉద్యోగాలకు కూడా ముప్పు రావచ్చని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
హైదరాబాద్ ఐటీ నిపుణుల్లో టెన్షన్!
హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లి గూగుల్, యాపిల్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న వేలమంది ఐటీ నిపుణులు ఇప్పుడు డైలమాలో పడ్డారు. పెళ్లిళ్లు, పండుగలకు ఇండియా రావాలనుకున్న వారు తమ ప్లాన్లను రద్దు చేసుకుంటున్నారు. గూగుల్ మాతృసంస్థ 'ఆల్ఫాబెట్' ఇప్పటికే సెప్టెంబర్ నుంచి తన ఉద్యోగులను దేశం దాటవద్దని హెచ్చరిస్తూనే ఉంది. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త రూల్స్ తీసుకురావడంతో పరిస్థితి మరింత సీరియస్‌గా మారింది.
ఏదేమైనా అమెరికా వీసా విధానంలో వస్తున్న ఈ మార్పులు కేవలం ఉద్యోగులనే కాదు.. కంపెనీలను కూడా ఇబ్బంది పెడుతున్నాయి. లక్ష డాలర్ల ఫీజు మరియు సోషల్ మీడియా స్క్రూటినీ వంటి నిర్ణయాలు భవిష్యత్తులో భారతీయ టెక్కీల అమెరికా కలలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications